BigTV English

Actress Hema: నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ను కలవాలి

Actress Hema: నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ను కలవాలి

Actress Hema: టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం  తెల్సిందే. బెంగుళూరు రేవ్ పార్టీలో ఆమె అడ్డంగా దొరికిపోయింది. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని, ఆ పార్టీలో లేనని చెప్పుకొస్తూనే ఉంది. అయితే అన్ని ఆధారాలు  హేమకు వ్యతిరేకంగా ఉండడంతో పోలీసులు హేమపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ఇక అవేమి పట్టించుకోకుండా .. తాను ఆరోజు ఇంట్లోనే ఉన్నాను అంటూ బిర్యానీ చేస్తూ వీడియోలు పెట్టడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది.


ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా హేమ మరో కొత్త వీడియో రిలీజ్ చేసింది. తాను  డ్రగ్స్ తీసుకోలేదని, తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చింది . హెయిర్ నుంచి నెయిల్స్ వరకు టెస్టులు చేయించానని, తనకు నెగెటివ్ వచ్చిందని.. ఇప్పటివరకు తన బాడీలో డ్రగ్స్  లేవని తెలిపింది.

” అందరికి నమస్కారం..  నేను మీ హేమాను.. గత కొన్నినెలలుగా మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి.. అవి మీ అందరికి తెలుసు. మీడియా వాళ్లు  35 ఏళ్లుగా  నేను సంపాదించుకున్న పరువును ఎలా భూస్థాపితం చేసారో అందరికి తెల్సిన విషయమే. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను.  హెయిర్, బ్లడ్, నెయిల్స్ మొత్తం చేయించుకున్నాను. అన్నింటిలో నాకు నెగెటివ్ వచ్చింది.  ఈ విషయం నేను అన్ని ఛానెల్స్ లో కూడా చెప్పాను.


ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఒకటే.. నేను ఎలాంటి టెస్టులకు అయినా బహిరంగంగా  రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్ మెంట్ కావాలని అడగడానికి మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను.అందరు నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, జిహాద్ కు వర్క్ చేసినదానిలా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది. నేను ఇప్పుడు వారివద్దకు ఎలా వెళ్ళాలి అనేది తెలియక ఈ వీడియో పెడుతున్నాను.

నన్ను మీడియా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు. సెటిల్ మెంట్ చేస్తామన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తామని పిలిచారు.  నాకు, మీడియాకు గొడవలు లేవు.. నేనెందుకు  రావాలి. నేనే తప్పు చేయలేదు.. తప్పు చేయనప్పుడు  సెటిల్ మెంట్ కు ఎందుకు రావాలి. నన్ను ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో.. వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉన్నాయి నా దగ్గర. వారి నంబర్స్ కూడా త్వరలోనే అప్డేట్ చేస్తాను.  నాకు నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. నన్ను నమ్మమని నేను ఎవరిని అడగడం లేదు. నేను ఎలాంటి టెస్టులకు అయినా రెడీ. నాకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్ల అపాయింట్ మెంట్ కావాలి. నా వాయిస్ వారివద్దకు వెళ్ళాలి”  అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×