BigTV English

OnePlus 13: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న.. కొత్త మొబైల్ ‘వన్ ప్లస్ 13’.. ఫీచర్లు

OnePlus 13: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న.. కొత్త మొబైల్ ‘వన్ ప్లస్ 13’.. ఫీచర్లు

OnePlus 13 5G smartphone tipped to launch soon: చైనీస్ టెక్ బ్రాండ్ అయిన వన్ ప్లస్ ప్రీమియర్ స్మార్ట్ ఫోన్స్ సంస్థ.. సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్.. వన్ ప్లస్ 13 ను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది.  అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ఇంకా ధృవీకరించ లేదు. కానీ ఆ మొబైల్  ఫోన్ లో ఉండే ఫీచర్లు మాత్రం బయటకు వచ్చాయి. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.


ఈ కొత్త మొబైల్ ఫోన్ చూస్తుంటే, ఇది దాదాపు వన్ ప్లస్ 12కి సమానంగా ఉందని అంటున్నారు. అంతేకాదు ఇందులో  లేటెస్ట్ ప్రాసెసర్, హై ఎండ్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉండటం విశేషంగా చెబుతున్నారు. ఫోన్ లాంఛ్ టైమ్, డిజైన్, ధర ఎంత ఉండవచ్చు తదితర కొన్ని విషయాలు మాత్రమే బయట మార్కెట్లో చక్కెర్లు కొడుతున్నాయి.

వీటి ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వీటి ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఇది కూడా బేస్ వేరియంట్ తో అందుబాటులో ఉండనుందని బయటకు వస్తున్న లీకుల ద్వారా తెలుస్తోంది.


ఒకసారి ఈ ఫీచర్స్ ను చూస్తే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉందని అంటున్నారు. అలాగే అండర్ డిస్ ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ నెట్ వర్క్ సపోర్ట్,  యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వన్ ప్లస్ 12ని ఆధునీకరించి, కొత్త టెక్నాలజీతో మార్పులు చేర్పులు చేసి వన్ ప్లస్ 13 విడుదల చేస్తున్నారని చెబుతున్నారు.

Also Read: ఐక్యూ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. కెమెరా, బ్యాటరీ అదరహో..!

అయితే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు సర్క్యూలర్ కెమెరా మాడ్యూల్ తో రానున్నట్టు తెలిసింది. అయితే ధర ని చూస్తే మాత్రం వన్ ప్లస్ 12కు అటూ, ఇటూగా ఉంటుందని అంటున్నారు. వన్ ప్లస్ మొబైల్ ఫోన్ 2023 డిసెంబర్ 12న చైనాలో లాంచ్ అయ్యింది. అయితే నాడు ఈ మొబైల్ ఫోన్ ధర రూ.64, 999 తో మొదలైంది. వన్ ప్లస్ 13 మాత్రం జనవరి 2025, సంక్రాంతికి లేదా ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఇదే ధరతో ఉండవచ్చునని అంటున్నారు.

Related News

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

iPhone Price Drops: ఐఫోన్ 15 ధర తగ్గిందోచ్.. మళ్ళీ ఈ ఆఫర్ ఉండదేమో..?

Shock to Airtel Customers: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. ఆప్లాన్ తొలగింపు

Redmi Note 15 Pro+: రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీ, 90W చార్జింగ్ లాంటి సూపర్ ఫీచర్లు

Big Stories

×