E-Paper
Advertisement

Satyabhama Release Date: కాజల్ ‘సత్యభామ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Satyabhama Release Date: కాజల్ ‘సత్యభామ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Advertisement

Kajal Styabhama Release Date Fixed: నటి కాజల్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలతో జతకట్టి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్‌లతో కుర్రకారును ఊర్రూతలూగించింది.

అయితే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును మ్యారేజ్ చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కుటుంబం, పిల్లలతో లైఫ్‌ను లీడ్ చేసింది. అయితే అంతా చక్కబడ్డాక ఇప్పుడు మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతేడాది బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ మూవీలో హీరోయిన్‌గా నటించింది.

Advertisement

ఆ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే కాజల్ పలు సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. అయితే ఆమె నటిస్తున్న చిత్రాల్లో లేడీ ఓరియేంటెడ్ మూవీ ఒకటుంది. అదే ‘సత్యభామ’. ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.

Also Read: ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్.. కదనరంగాన కాలుమోపిన సత్యభామ

Advertisement

అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఎప్పుడెప్పుడు వెల్లడిస్తారా అంటూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా జూన్ 7న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, హర్షవర్థన్, ప్రకాష్ రాజ్, నాగినీడు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×