E-Paper
Advertisement

Kajal Satyabhama Teaser : ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్.. కదనరంగాన కాలుమోపిన సత్యభామ

Kajal Satyabhama Teaser : ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్.. కదనరంగాన కాలుమోపిన సత్యభామ
Advertisement
Satyabhama Teaser

Kajal Satyabhama Teaser : టాలీవుడ్ చందమామ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడంతోనే వరుస సినిమాలను లైన్లో పెట్టింది. భగవంత్ కేసరిలో బాలయ్య సరసన నటించి.. సూపర్ హిట్ అందుకున్న కాజల్ మరో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీపావళి సందర్భంగా ఆ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. పూర్తిగా లేడీ ఓరియంటెడ్ గా వస్తున్న సత్యభామ.. కాజల్ కెరీర్ లో 60వ చిత్రం కావడం విశేషం. అందుకే ఈ సినిమాపై అంచనాలున్నాయి.

టీజర్ విషయానికొస్తే.. కాజల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. సత్యభామగా కనిపిస్తుంది. ఆమె పై అధికారిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. ఇప్పటివరకూ చందమామలా కనిపించిన కాజల్.. ఈ టీజర్ లో మాత్రం యుద్ధానికి దిగిన సత్యభామలా కనిపించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో తన యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో చూపించిన కాజల్.. టీజర్ లో అంతకుమించిన యాక్షన్ ను చూపించింది.

Advertisement

సత్యభామ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సత్యభామ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోవడం, ఆ కేసునుంచి సత్యభామను తీసేయడం, తనవల్ల తప్పు జరగడంతో ఆ కేసును ఆఫ్ డ్యూటీలో ఇన్వెస్టిగేట్ చేయడం సినిమా కథగా తెలుస్తోంది. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు..

.

Advertisement

.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×