BigTV English

Actress Namita Divorce: భర్తతో నమిత విడాకులు.. ఇదిగో క్లారిటీ..?

Actress Namita Divorce: భర్తతో నమిత విడాకులు.. ఇదిగో క్లారిటీ..?

Actress Namita Clarified Divorce with Her Husband: ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. సినిమా, సీరియల్ అని లేకుండా సెలబ్రిటీలు విడాకులు తీసుకుని షాక్ ఇస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఏడాది కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియా కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలు కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోతే వారు విడిపోయారని, విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు సృష్టిస్తున్నారు.


తాజాగా బొద్దు భామ నమిత కూడా విడాకుల బాట పట్టిందని వార్తలు గుప్పుమన్నాయి. సొంతం సినిమాతో నమిత తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత అమ్మడు తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే టాలీవుడ్ దర్శకుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కవలలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం వీరేంద్ర బిజినెస్ లతో బిజీగా ఉండగా .. నమిత ఒకపక్క రాజకీయాలకు ప్రచారం చేస్తూనే ఇంకోపక్క అడపాదడపా టీవీ షో లలో కనిపిస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా వీరేంద్రకు నమిత విడాకులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.


Also Read: Pushpa 2 Second Song: సింపుల్ అండ్ మాస్ స్టెప్పులతో పుష్ప, శ్రీవల్లీ దుమ్ము దులిపేశారు.. సుకుమార్ డాన్స్ వేరే లెవెల్

ఇక ఈవార్తలపై నమిత స్పందించింది. విడాకులు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ” ఇలాంటి పుకార్లు రావడం సహజమే. నేను ఇలాంటి వార్తలు వస్తాయని తెలిసే.. నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాను. అయినా కూడా విడాకులు అని వార్తలు పుట్టిస్తున్నారు. నటిగా నేను ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ ను విన్నాను.. వాటిని ఎదుర్కొన్నాను. ఇక ఈ విడాకుల వార్తలు విని నేను నా భర్త నవ్వుకున్నాం” అంటూ తెలిపింది. ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నమిత వ్యాఖ్యలు విన్న ఆమె అభిమానులు మీరుఇలాంటి వార్తలు పట్టించుకోకండి.. హ్యాపీగా ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×