BigTV English

Pushpa 2 Second Song: సింపుల్ అండ్ మాస్ స్టెప్పులతో పుష్ప, శ్రీవల్లీ దుమ్ము దులిపేశారు.. సుకుమార్ డాన్స్ వేరే లెవెల్

Pushpa 2 Second Song: సింపుల్ అండ్ మాస్ స్టెప్పులతో పుష్ప, శ్రీవల్లీ దుమ్ము దులిపేశారు.. సుకుమార్ డాన్స్ వేరే లెవెల్

Pushpa 2 new song(Latest news in tollywood): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప2 ’. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని అందకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. దీంతో సెకండ్ పార్ట్‌పై మూవీ యూనిట్‌కు మరింత భారం పడింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించాలి కాబట్టి.


దీని కారణంగానే ఎప్పుడో స్టార్ట్ అయిన ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దర్శకుడు సుకుమార్ ఈ సీక్వెల్ కోసం ఎక్కడా తగ్గడం లేదు. క్వాలిటీ, ఇతర సీన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఓ ఎత్తు అయితే గ్లింప్స్, టీజర్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. దీనిపై మంచి హైప్ ఉండటంతో మేకర్స్ కూడా అంచనాలు పెంచేందుకు తరచూ ఏదో ఒక అప్డేట్‌ను రిలీజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘సుసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అంటూ సాగే ఈ సాంగ్ అత్యద్భుతంగా ఉంది. ఇక ఈ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంటే.. దానికి బన్నీ, రష్మిక హూక్ స్టెప్పులు మాత్రం అబ్బో ఇక చెప్పాల్సిన పనే లేదు. ఎలాంటి హార్డ్ స్టెప్పులు లేవు. కేవలం చాలా సింపుల్‌గా క్లాసిక్‌గా ఇచ్చి పడేశారు. మ్యూజిక్‌కి తగ్గ స్టెప్పులు వేస్తూ అదరగొట్టేశారు. అస్సలు ఇలాంటి స్టెప్పులను బన్నీ నుంచి ఎవ్వరూ ఎక్స్‌పెర్ట్ చేసుండరు.


Also Read: పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ వచ్చేసిందోచ్..

ఇక బన్నీ, రష్మిక మాత్రమే కాదు.. దర్శకుడు సుకుమార్ కూడా తన స్టెప్పులతో అదరగొట్టేశాడు. తన టీంతో కలిసి చిన్న చిన్న స్టెప్పులేసి దుమ్ము దులిపేశాడు. మొత్తంగా ఈ సాంగ్‌కి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమనే తెలుస్తోంది. ఓ రకంగా చూస్తే ఈ చిత్రానికి రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఓ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేయడం చూశాం.. ఇక ఇప్పుడు ఈ రెండో సాంగ్ కూడా సూపర్‌గా ఉండటంతో సాంగ్స్ అన్నీ ధూమ్ ధామ్‌గా ఉంటాయని అర్థమైపోయింది. మరి ఈ మూవీ కోసం ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. దీనిపై సినీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్లాసిక్ స్టెప్పులతో అదరగొట్టేశారు భయ్యా అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×