BigTV English

Samantha Comments: హీరో అల్లు అర్జున్‌పై నటి సమంత షాకింగ్ కామెంట్స్

Samantha Comments: హీరో అల్లు అర్జున్‌పై నటి సమంత షాకింగ్ కామెంట్స్

Actress Samantha's shocking comments on hero Allu Arjun1


Actress Samantha Shocking Comments on Hero Allu Arjun: హీరోయిన్‌ సమంత ఏంమాయ చేశావే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో మంచి మార్కులు కొట్టేసింది. అతి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఏంమాయ చేశావే మూవీలోనే చైతూతో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత పెళ్లి,మనస్పర్థలు, విడాకులు ఇలా ఊహించని విధంగా ఈ జంట విడిపోయి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే… ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటనలో తనకు రోల్‌ మోడల్‌ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన సమంత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి ఆడియెన్స్‌ని ఎంతగానో మెప్పించింది. తన రోల్‌ మోడల్‌ బన్నీ అని కుండబద్దలు కొట్టేసింది ఈ భామ. వీరిద్దరు కలిసి గతంలో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ అనంతరం ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ అనే సాంగ్‌కి ఐటమ్‌ సాంగ్‌ చేసి అందరిని ఉర్రూతలూగించింది సామ్‌ బేబీ.


Read More:  అల్లు అర్జున్ -స్నేహారెడ్డి 13వ వార్షికోత్సవం.. రొమాంటిక్ నోట్ షేర్ బన్నీ.. పుష్ప 2 అప్డేట్ కూడా

ఇక బన్నీ సమంత కాంబోలో ఇంకో మూవీ వస్తే చూడాలని ఆడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా..సామ్ ఓ కాలేజీ ఈవెంట్‌లో భాగంగా సామ్‌ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ఓ స్టూడెంట్ మీకు యాక్టింగ్ రోల్ మోడల్ ఎవరని సామ్‌ని ప్రశ్నించగా..దానికి సమంత రిప్లై ఇస్తూ..నా యాక్టింగ్ రోల్ మోడల్ ఐకాన్‌ అల్లుఅర్జున్ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. తనతో కలిసి మరో మూవీలో యాక్ట్ చేయాలని అనుకుంటున్నానని.. ఐకాన్‌ స్టార్‌ ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారని ప్రశంసలు కురిపించింది.

సమంత తిరిగి మళ్లీ మూవీలతో బిజీగా మారనున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్‌కు సామ్ ఓ ఏడాది బ్రేక్ తీసుకుంది. మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.టాలీవుడ్‌లో సమంత చివరిగా ఖుషి మూవీలో యాక్ట్ చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. సామ్ రానున్న రోజుల్లో తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడపనుంది.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×