BigTV English

Allu Arjun: అల్లు అర్జున్ -స్నేహారెడ్డి 13వ వార్షికోత్సవం.. రొమాంటిక్ నోట్ షేర్ బన్నీ.. పుష్ప 2 అప్డేట్ కూడా

Allu Arjun: అల్లు అర్జున్ -స్నేహారెడ్డి 13వ వార్షికోత్సవం.. రొమాంటిక్ నోట్ షేర్ బన్నీ.. పుష్ప 2 అప్డేట్ కూడా


Allu Arjun and Sneha Reddy: టాలీవుడ్ బ్యూటిఫుల్ లవ్ కపుల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి ఒకరు. ఈ జంట మొదటి సారిగా ఒక ఫ్రెండ్ పెళ్లిలో ఒకరినొకరు కలుసుకున్నారు. మొదటి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు.

ఆ తర్వాత ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకున్నారు. అప్పట్నుంచి కొన్నేళ్లపాటు ప్రేమాయణం చేసి ఆ తర్వాత మార్చి 6 2011లో ఇటు కుటుంభ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అనంతరం 2014లో వారు తమ కుమారుడు అయాన్‌ను స్వాగతించారు. ఆ తర్వాత 2016లో అర్హాకి జన్మనిచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ జంట టాలీవుడ్ మోస్ట్ లవ్ కపుల్‌గా ఉన్నారు.


అయితే ఈరోజు మార్చి 6. ఈ సందర్భంగా ఈ లవ్ కపుల్ తమ 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా.. నటుడు బన్నీ తన భార్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫొటో పంచుకున్నాడు. ఈ మేరకు ఓ నోట్ రాసుకొచ్చాడు.

READ MORE: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

తన భార్యతో తాను దిగిన ఓ ఫొటోని పంచుకుంటూ.. ఇలా రాశాడు.. ‘‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ. ఇప్పటికి 13 ఏళ్లు. నీ సాంగత్యం వల్ల నేను అభివృద్ధి చెందాను. నేను మీ ప్రశాంతత నుండి శక్తిని పొందుతాను’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నోట్‌పై పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం దేశంలో అత్యంత బహుముఖ, డిమాండ్ ఉన్న నటులలో అల్లు అర్జున్ ఒకరు. ఈ నటుడు పుష్ప మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ 2021లో రిలీజై సంచన విజయం సృష్టించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ను దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు.

ఫస్ట్ పార్ట్ భారీ లెవెల్లో రెస్పాన్స్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

READ MORE: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి కార్డు వైరల్..

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీని ఈ ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగానే షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు.

కాగా ఇటీవల బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఐకాన్ స్టార్ ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ అందించిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఫ్రాంచైజీగా రూపొందించాలనే ఆలోచన తమ మూవీ యూనిట్‌లో ఉందని తెలిపాడు. ఆయన వ్యాఖ్యలతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇకపోతే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈ మూవీ టైటిల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×