E-Paper
Advertisement

Adipurush OTT: ఓటీటీలో ‘ఆదిపురుష్‌’.. ఎప్పుడంటే? ఎక్కడంటే?

Adipurush OTT: ఓటీటీలో ‘ఆదిపురుష్‌’.. ఎప్పుడంటే? ఎక్కడంటే?
Advertisement
Adipurush OTT

Adipurush OTT: దేశమంతా ‘ఆదిపురుష్‌’ మేనియా నడుస్తోంది. ప్రభాష్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు. వెండితెరపై తమ డార్లింగ్‌ను రాఘవగా చూసి మురిసిపోతున్నారు. మీసాల రాముడు బాగున్నాడని పండుగ చేసుకుంటున్నారు. మరి, సినిమా ఎలా ఉందంటే? కేక. ప్రభాష్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. రివ్యూలు, రేటింగ్స్ మాత్రం 2కు అటూఇటూగా వస్తున్నాయి. రామాయణం, రాముడి వనవాసం, సీతా అపహరణం, లంకా దహనం, రావణ సంహారం.. అందరికీ తెలిసిక కథనే. కాకపోతే, గ్రాఫిక్స్, యానిమేటెడ్ సీన్స్‌తో.. విజువల్ వండరే ఈ ‘ఆదిపురుష్’. 3డీ లో మరింత బాగుందంటున్నారు.

ఆదిపురుష్ థియేటర్లలోకి వచ్చేసింది. నెక్ట్స్ ఏంటి? ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కాబోతోంది? ఇప్పుడు నెట్లో ఇదే సెర్చింగ్. ఆదిపురుష్ టాక్ సో సో గా ఉండటంతో.. థియేటర్లో చూడాలనుకునే వారు ఆగిపోతున్నారు. రిలాక్డ్స్‌గా ఓటీటీలో చూడొచ్చని భావిస్తున్నారు. అయితే, విజువల్ వండర్స్‌తో కూడిన మూవీ కావడంతో.. బిగ్ స్క్రీన్‌లో చూస్తేనే బాగుంటుంది. థియేటర్లలో, ఆ సౌండ్ సిస్టమ్‌తో.. రామాయణ గాథను కంటూ, వింటూ.. ఎంజాయ్ చేయొచ్చని చెబుతున్నారు.

Advertisement

మరోసారి చూద్దామనుకునే వారు, థియేటర్‌కు వెళ్లొద్దనుకునే వారు.. ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘ఆదిపురుష్‌’ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, ఇప్పుడే కాదు. త్వరలో కూడా కాదట. ఇంకా డేట్ ఫిక్స్ చేయకున్నా.. ఆదిపురుష్ ఓటీటీలోకి వచ్చేందుకు చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు. కనీసం 8 వారాలు.. అంటే రెండు నెలల తర్వాతే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆదిపురుష్ స్ట్రీమింగ్ అంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×