E-Paper
Advertisement

Adipurush: ఆ తలలేంటి ఓం రౌత్?.. రావణుడిపై ఫుల్ ట్రోలింగ్..

Adipurush: ఆ తలలేంటి ఓం రౌత్?.. రావణుడిపై ఫుల్ ట్రోలింగ్..
Advertisement
adipurush ravanasura

Adipurush: రావణాసురుడు. అరివీర భయంకరుడు. బ్రహ్మ రాక్షసుడు. మహా క్రూరుడు. పది తలలుండే శక్తివంతుడు. ఇన్నాళ్లూ మనం చూసిన, విన్న రావణుడి వర్ణణ ఇదే. ఎప్పుడూ 10 తలకాయలతో ఉండడు. అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. మామూలప్పుడు ఒక్క తలతోనే ఉంటాడు రావణ్.

మధ్యలో మొయిన్ తల. అటు నాలుగు, ఇటు ఐదు. మొత్తం పది తలలు. భయంకరంగా ఉంటుంది రావణుడి రూపం. కానీ, ఆదిపురుష్ సినిమాలో రావణుడిని డిఫరెంట్‌గా చూపించాడు దర్శకుడు ఓం రౌత్.

Advertisement

రావణుడైన సైఫ్ అలీఖాన్‌కు ఉండే పది తలలను వరుసగా ఉన్నట్టు చూపించలేదు. తల మీద తల. కింది వరుసలో ఓ ఐదు తలకాయలు.. ఆ పైన మరో ఐదు తలలు. అలా రెండు వరుసల్లో మొత్తం 10 తలల రావణుడు. ఇదీ ఆదిపురుష్‌లో రావణుడిని చూపించిన రూపం.

అందులోనూ రావణుడి తలలకు కిరీటాలు, భారీ ఆభరణాలు గట్రా లేవు. పైగా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో చూపించాడు. ఒక్కో తలకు ఒక్కో హెయిర్ డిజైన్. కొన్నిటికి స్పైక్స్ కూడా పెట్టారు. గుబురు గడ్డం కూడా బోనస్. తనకిష్టం వచ్చినట్టు రావణుడి గెటప్ క్రియేట్ చేశాడు ఓం రౌత్. ఇన్నాళ్లూ టీవీల్లో, సినిమాల్లో చూసిన రావణాసురుడు వేరు.. ఆదిపురుష్‌లో రావణ్ వేరు. ఇదే ఇప్పుడు ట్రోలర్స్‌కు పని చెప్పింది.

Advertisement

ఓం రౌత్ ఓవరాక్షన్‌పై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. ఇదేం సెటప్? రావణుడు ఇలా ఉన్నాడేంటి? అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వరుసగా 10 తలలు కాకుండా.. ఐదు, ఐదు చొప్పున రెండు వరుసల్లో పది తలకాయటేంటి? ఇదేం గెటప్? అంతా ఓం రౌత్ ఇష్టమా? సినిమా పేరుతో రామాయణంలోని పాత్రలను తనకిష్టం వచ్చినట్టు చూపించుకోవడమేనా? అది రావణుడు కాబట్టి సరిపోయింది.. అదే రాముడి గెటప్‌తో ఇలాంటి ఎక్స్‌పరిమెంట్స్ చేస్తే.. ఈపాటికి తెలుసొచ్చేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీసాల రాముడు చూట్టానికి బాగున్నాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే దుమ్ము లేచిపోయేది అంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×