BigTV English

Big TV Exclusive: లైంగిక వేధింపుల కేసు.. అడ్డంగా దొరికిపోయిన మరో స్టార్ కొరియోగ్రాఫర్.. ?

Big TV Exclusive: లైంగిక వేధింపుల కేసు.. అడ్డంగా దొరికిపోయిన మరో స్టార్ కొరియోగ్రాఫర్.. ?

Big TV Exclusive:  టాలీవుడ్ లో లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హేమా కమీటీ పుణ్యమా అని ఇండస్ట్రీలో అమ్మాయిలు నోరు విప్పుతున్న విషయం తెల్సిందే.  ఇక టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు తో మొదలయ్యింది. ఈ కేసు తరువాత తమను వేధించినవారిపై కేసు పెట్టడానికి ఇండస్ట్రీలో పనిచేస్తున్న అమ్మాయిలు ధైర్యంగా బయటకు వస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ తో మొదలైన వ్యవహారం..  జానీ మాస్టర్ తో హీట్ ఎక్కింది.. అది తగ్గే లోపు యూట్యూబర్ హర్షసాయి చిక్కాడు.


ఇక వీరి లిస్ట్ లోనే మరో స్టార్ కొరియోగ్రాఫర్ చేరాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కూడా.. ఒకయువతిని వేధించడం.. ఆమె ఇతగాడి వేధింపులు తట్టుకోలేక పోలీసుల చెంతకు వెళ్లాలనుకోవడం జరిగాయి. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ  సదురు స్టార్ కొరియోగ్రాఫర్.. జానీ మాస్టర్ కంటే  ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో అతగాడిని మించిన స్టార్ కొరియోగ్రాఫర్  లేడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్ తో పాటు  బాలీవుడ్ లో కూడా అందరి స్టార్ హీరోలతో కలిసి పనిచేసి   మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేనా..  కొన్ని కామెడీ షోస్ లో కూడా పాల్గొన్నాడు. అసలు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ కు  ఫిదా  కానీ ప్రేక్షకుడు లేడు అంటే నమ్మండి. ఇకపోతే మొన్నటికి మొన్న ఈ  డ్యాన్స్ మాస్టర్.. జానీ కేసులో  ఇలాంటివారిని వదలకూడదు అని నీతులు కూడా చెప్పాడు. అలాంటి  ఈ స్టార్ కొరియోగ్రాఫర్  గుట్టు రట్టు అయ్యింది.   ఇతగాడు కూడా ఆ కామాంధుల్లో ఒకడే అని తేలిపోయింది.


ఒక యువతిని లైంగికంగా  వేధించడంతో.. ఆమె  కొరియోగ్రాఫర్  గుట్టు రట్టు చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో.. ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకొని కేసు కాకుండా ఆపినట్లు సమాచారం.  బాగా  పలుకుబడి ఉన్న ప్రముఖులను ఈ స్టార్  కొరియోగ్రాఫర్ కలిసి.. ఈ గండం నుంచి గట్టెక్కించమని అడిగాడట. ఇప్పటికే జానీ మాస్టర్ కేసు వలన టాలీవుడ్  పరువు పోయింది. మళ్లీ  ఇతగాడి విషయం  బయటకు పొక్కితే.. ఇంకా బ్యాడ్  నేమ్ వస్తుందని  పలువురు ప్రముఖులు, ఛాంబర్ పెద్దలు,  బాధిత యువతిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు పిలిపించి  సామరస్యంగా పరిష్కరించినట్లు సమాచారం.

యువతిని కేసు పెట్టవద్దని బతిమలాడి.. స్టార్ కొరియోగ్రాఫర్  పరువును కాపాడారని తెలుస్తోంది.   ఇప్పటివరకు ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం.. మాకు చెప్పండి అన్న ఛాంబర్ నే .. ఇలా స్టార్స్ తప్పు చేస్తే  సమర్ధించడం,  గుట్టు చప్పుడు కాకుండా పంచాయితీ పెట్టి క్లోజ్  చేయడం దారుణమనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక  ఇలాంటివి జరిగాకా.. ఇంతకన్నాపెద్ద  స్టార్స్ లైంగిక వేధింపులకు గురిచేస్తే ఏ అమ్మాయి చెప్పడానికి ధైర్యంగా ముందుకు వస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇందులో నిజ నిజాలు ఏంటి అనేవి   తెలియాలంటే  కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×