BigTV English

Devara Movie: మరోసారి ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. ఆ థియేటర్లలో ‘దేవర’ ప్రీమియర్ రద్దు

Devara Movie: మరోసారి ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. ఆ థియేటర్లలో ‘దేవర’ ప్రీమియర్ రద్దు

Devara Movie: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ‘దేవర’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆసక్తి కొన్నిసార్లు శృతిమించుతోంది. వారివల్లే ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్ అయ్యింది. ఇప్పుడు థియేటర్లలో ప్రీమియర్ షోలు రద్దు అయ్యేవరకు వచ్చింది. దీంతో పలువురు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లలో ‘దేవర’ సినిమాకు ప్రీమియర్ షో రద్దు చేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. దానికి ఎన్‌టీఆర్ అభిమానులే కారణం


ప్రీమియర్ షో రద్దు

సెప్టెంబర్ 27న ‘దేవర’ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఖరారు అయ్యింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతించడం వల్ల సెప్టెంబర్ 26 అర్థరాత్రి నుండే ఈ సినిమా ప్రీమియర్, ఫ్యాన్ షోలు ఏర్పాటు అయ్యాయి. అయితే ఆ ప్రీమియ్ షో టికెట్ల కోసం కూకట్‌పల్లిలోని భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ల వద్ద భారీ సంఖ్యలో ఎన్‌టీఆర్ అభిమానులు చేరుకున్నారు. ఈ రెండు థియేటర్లలో కలిపి ఉన్న టికెట్లు అన్నీ తమరికే ఇవ్వాలని గొడవ మొదలుపెట్టారు. దానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. టికెట్లు అన్నీ కొందరికే ఇవ్వడం కష్టమని చెప్పింది. అయినా ఫ్యాన్స్ వినకుండా గొడవ పెద్దగా చేయడంతో మొత్తానికి ఈ రెండు థియేటర్లలో ప్రీమియర్ షోలను రద్దు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.


Also Read: నచ్చితే చూస్తారు.. లేదంటే లేదు.. కొరటాల గారు ఏదో తేడా కొడుతుందే..?

వీడియో వైరల్

మూడేళ్ల తర్వాత ఎన్‌టీఆర్‌ను తెరపై చూాడాలనుకునే ఫ్యాన్స్ ఉత్సాహం కరెక్టే అయినా కూడా వారి వల్ల ఇతర మూవీ లవర్స్, ప్రేక్షకులు, ఇతర హీరోల అభిమానులు ఇబ్బందులు పడక తప్పడం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా కొంతమంది వల్ల ప్రశాంతంగా మూవీ చూసే ఎక్స్‌పీరియన్స్ మిస్ అవుతున్నామని అంటున్నారు. ఎన్‌టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకు మొదటిరోజే టికెట్లు దొరకడం కాస్త కష్టమే అని, కానీ అలా థియేటర్లలో ఉన్న టికెట్లు అన్నీ తమకే ఇచ్చేయమని వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదని ఫీలవుతున్నారు. కూకట్‌పల్లి భ్రమరాంబ మల్లికార్జున వద్ద భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకొని గొడవ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యింది.

డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్

ఇప్పటివరకు ‘దేవర’ సినిమాకు తెలుగు పెద్దగా ప్రమోషన్స్ జరగలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాత్రం భారీగా ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఫైనల్‌గా అది కూడా ఫ్యాన్స్ వల్లే క్యాన్సెల్ అయ్యింది. నోవోటెల్‌లో ‘దేవర’ ప్రీ రిలీజ్ ఏర్పాటు చేయగా అక్కడికి ఫ్యాన్స్ భారీగా చేరుకొని వస్తువులు ధ్వంసం చేయడంతో ఈవెంట్ ఆగిపోయింది. ఇదంతా చూసిన తర్వాత ఫ్యాన్స్ ఇలా చేయడం వల్ల ‘దేవర’పై నెగిటివిటీ వస్తుందని చెప్పడానికి డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగారు. సినిమాపై నెగిటివిటీ పెరిగేలా చేయవద్దని ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. అయినా సరే కొందరి ధోరణి మారేలా లేదని చెప్పడానికి ప్రీమియర్ షోలు క్యాన్సెల్ అవ్వడమే ఉదాహరణ.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×