BigTV English

Akira Nandan: అన్న చరణ్ ను గుర్తుచేస్తున్న అకీరా.. సేమ్ టూ సేమ్

Akira Nandan: అన్న చరణ్ ను గుర్తుచేస్తున్న అకీరా.. సేమ్ టూ సేమ్

Akira Nandan: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఇంకా ఎవరైనా రావాలని ఎదురుచూస్తున్నారు అంటే అది కేవలం అకీరా నందన్ కోసమే. పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా ఎప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా.. ? అని మెగా ఫ్యాన్స్ కాచుకొని కూర్చున్నారు. కానీ, అకీరా మాత్రం అది ఇప్పుడప్పుడే అవ్వదులే అన్నట్లు ఉంటున్నాడు. అకీరాను చూసిన అభిమానులు ఎవరైనా.. అతనిలో మెగా హీరోలందరూ కనిపిస్తూ ఉంటారు అని చెప్పుకొస్తారు.


తండ్రి పవన్ లానే అకీరా కూడా చాలా సిగ్గరి. కెమెరా ముందు ఎక్కువ రాడు. ఈ విషయాన్నీ అకీరా తల్లి రేణు ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. అంతెందుకు ఈ మధ్య అకీరా పుట్టినరోజు జరిగింది. అప్పుడు కూడా అతడిని ఒక్క ఫోటో తీయడానికి ఎంత కష్టపడిందో ఆమె ఒక వీడియోలో చూపించింది. అంత సిగ్గరి.. ఇక సినిమాలు చేస్తాడా.. ? అనే అనుమానం ఫ్యాన్స్ లో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇంకోపక్క రేణు మాత్రం.. అకీరా ఏది కావాలంటే అది చేయమని చెప్తాను.. బలవంతంగా ఏది చెప్పను అని చెప్పడంతో అసలు ఈ కుర్రాడు ఎంట్రీ ఇస్తాడా.. ? అనే సందేహం కూడా అభిమానుల్లో లేకపోలేదు. కానీ, అతని రూపురేఖలు పెరిగేకొద్దీ మెగా హీరోలను గుర్తుచేయడంతో మళ్లీ ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.

తాజాగా అకీరా లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకుముందు నూనూగు మీసాలతో కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించాడు. సడెన్ గా అతడిని చూస్తే.. చిరుతకు ముందు రామ్ చరణ్ ఎలా ఉన్నాడో అలాగే కనిపిస్తున్నాడు. అకీరాను చూడగానే అందరు చరణ్ ను గుర్తుచేసుకుంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఒకేలా ఉన్నారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఈ కుర్రాడు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బావుంటుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×