Akkada Ammayie Ikkada Abbayie.. ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju).. బుల్లితెరపై ఫిమేల్ యాంకర్స్ లో నంబర్ వన్ ఫిమేల్ యాంకర్ గా సుమా కనకాల (Suma kanakala) ఎంతటి పేరైతే సొంతం చేసుకుందో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా అంతే పేరు సొంతం చేసుకున్నారు. యాంకర్ గా పలు షోలకు వ్యవహరిస్తూ.. తన చలాకీతనంతో ఆట, మాట తీరుతో అందరిని అబ్బురపరుస్తూ ఉంటారు. అంతేకాదు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా కూడా చేసి ఆకట్టుకున్న ప్రదీప్ .. తొలిసారి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
మొదటి సినిమాతో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ప్రదీప్ నుండి ఇప్పుడు వస్తున్న రెండవ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. తోటి యాంకర్ అయిన దీపిక పిల్లి (Deepika Pilli) హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రానికి మాజీ జబర్దస్త్ డైరెక్టర్ నితిన్ భరత్ (Nithin Bharath) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ విడుదల తేదీని ప్రకటించారు. 2025 ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇక మొత్తానికైతే పోస్టర్తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పోస్టర్ గమనించినట్లయితే.. ఇందులో ప్రదీప్ మాచిరాజు ,దీపిక పిల్లి చాలా ఎక్సైటింగ్ గా ఏదో చూస్తూ కనిపించారు. వీరి వెనకాల మాత్రం గెటప్ శ్రీను తో పాటు మరికొంతమంది కమెడియన్స్ కత్తులు పట్టుకొని వీళ్లను నరకడానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.
ALSO READ:Amitabh Bachchan: కల్కి2 పై గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన బిగ్ బి.. పూనకాలు లోడింగ్..!
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ విశేషాలు..
ఇకపోతే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హిట్ మూవీ టైటిల్ తోనే వస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫస్ట్ మూవీలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాలుగేళ్లు విరామం తీసుకున్న ప్రదీప్.. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో ప్రదీప్, దీపిక అద్భుతంగా నటించినట్లు ఇటీవల టీజర్ చూస్తే ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రదీప్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, సత్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు