Weather Updates: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఒకప్పుడు ఏప్రిల్ నెలలో ఎండలు దంచి కొట్టేవి. ఈసారి ఫిబ్రవరి నుంచే ఎండలు భగభగ మంటున్నాయి. ఇక మార్చి గురించి చెప్పనక్కర్లేదు. రాత్రి వేళ అర్థరాత్రి వరకు వేడి కంటిన్యూ అవుతోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వేళ ఐఎండీ చల్లని కబురు చెప్పింది.
వాతావరణంలో మార్పులు
వాతావరణంలో మార్పుల వల్ల ఏపీ-యానాంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాగల మూడు రోజుల వరకు వాతావరణ ఇలా ఉండనుంది. తూర్పు గాలుల ద్రోణి, మన్నార్ గల్ఫ్ నుండి తమిళనాడు మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించాయి.
దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్-యానాంలలో నైరుతి, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
ఏపీలో ఏ విధంగా ఉండనుంది
ఉత్తర కోస్తాంధ్ర-యానాంల్లో ఆదివారం, సోమవారం వాతావరణం పొడిగా ఉంటుంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమయిన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు వచ్చే అవకాశము లేదు. ఇక ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశము లేదు.
ALSO READ: కేంద్రం నుంచి ఏపీకి ఊహించని పరిణామం
దక్షిణ కోస్తాంధ్ర: వాతావరణం పొడిగా ఉంటుంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమయిన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశము లేదు. మంగళవారం కూడా వాతావరణం పొడి ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు లో పెద్ద గా మార్పు వచ్చే అవకాశము లేదని చెబుతోంది భారతీయ వాతావరణ కేంద్రం.
రాయలసీమ: ఆదివారం, సోమవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. మంగళవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద గా మార్పు వచ్చే అవకాశం లేదు.
తెలంగాణ మాటేంటి?
తెలంగాణ: అటు తెలంగాణలో భానుడి నుంచి కాస్త రిలీఫ్ దక్కనుంది. ప్రస్తుత వేడి గాలులు మార్చి 20 నాటికి ముగియనున్నట్లు అంచనా వేసింది. మార్చి 20-25 మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 25 నుండి వేడి గాలులు మళ్ళీ మొదలవుతాయని తెలిపింది.