Amitabh Bachchan:కల్కి 2898AD.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin), దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దీపికా పదుకొనే (Deepika Padukone) తొలి తెలుగు పరిచయంలో వచ్చిన చిత్రం ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ (Ashwini Dutt) సమర్పణలో ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt) నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకొని రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ఏ సినిమా కూడా ఆయనకు మంచి విజయాన్ని అందించలేదు. కానీ ఈ సినిమా కలియుగం అంతం అయినప్పుడు కల్కి ఉద్భవించి సమాజాన్ని ఎలా కాపాడారు అనే ఊహాజనిత కథతో చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మొట్టమొదటి నగరంగా కాశీ ఎలా అయితే ఉద్భవించిందో.. కలియుగం అంతం అయ్యేసరికి చిట్టచివరి నగరంగా కాశీ మిగిలిపోతుందని, కలియుగం అంతంలో జరిగే ఎన్నో సంఘటనలను ఊహాజనితంగా తెరకెక్కించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు విజువల్ వండర్ గా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) యాక్షన్ పర్ఫామెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. 82 సంవత్సరాల వయసులో కూడా అమితాబ్ యాక్షన్ పర్ఫామెన్స్ లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈయనతో పాటు కమల్ హాసన్(Kamal Haasan) కూడా పోటీపడి మరీ నటించారు.
Samantha: మళ్ళీ సెలైన్ బాటిల్ తో బెడ్ పై సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్..!
KBC షో తర్వాతే..
అలా భారీ సక్సెస్ ను చవి చూసిన ఈ కల్కి సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ,కమలహాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం కొనసాగింపుతో ‘ కల్కి 2’ త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. ఈ సినిమా సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ కౌన్ బనేగా కరోడ్పతి షో(KBC Show) కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ పూర్తి చేసిన తర్వాత కల్కి 2 షూటింగ్లో పాల్గొంటారట.
కల్కి 2 పై బిగ్ బీ అప్డేట్..
మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని తెలిపారు. ఇక మొన్న మధ్యకాలంలో నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నా మాట్లాడుతూ.. “కల్కి 2898 ఏడి పార్ట్ 2 కి సంబంధించి దాదాపు 35% షూటింగ్ పూర్తయిందని తెలిపారు. కమాండర్ యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్ అందించడం ఖాయం అని కూడా వారు సినిమాపై హైప్ పెంచారు. ఇక ఇప్పుడు బిగ్ బి కూడా ఈ సినిమా షూటింగ్ పై అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఇకపోతే బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్.. కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్ర పోషించారు. ఇప్పుడు సీక్వెల్ లో కూడా ఆయన పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కి మరెలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.