BigTV English
Advertisement

Akkineni Amala: రూ.వేల కోట్లు ఉన్నా.. ఆ సమస్య నుంచి బయటపడని అమల.!

Akkineni Amala: రూ.వేల కోట్లు ఉన్నా.. ఆ సమస్య నుంచి బయటపడని అమల.!

Akkineni Amala.. వేలకోట్ల ఆస్తులున్న ఆవగింజంత అదృష్టం లేకపోతే అవన్నీ ఊడ్చుకుపోతాయనడంలో సందేహం లేదు. అయితే కొంతమంది విషయంలో ఇది మరింత అద్వానంగా ఉంటుందని చెప్పవచ్చు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా వాటిని అనుభవించే శక్తి వారికి లేదు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా.. కోట్ల ఆస్తి ఉన్నా స్టార్ స్టేటస్ ఉన్న కూడా అమలకే ఆ సంతోషం లేకుండా పోతోంది అంటూ ఆమె అభిమానులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


అక్కినేని వ్యాపారాలు చూసుకుంటూ సెటిల్ అయిన అమల..

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)భార్యగా, ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది అక్కినేని అమల(Akkineni Amala). ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత అక్కినేని కోడలుగానే సెటిలైపోయింది. జంతు సేవ చేస్తూ సమాజ సేవతోనే తన టైం ను గడుపుతోంది. ఇక అఖిల్ (Akhil) జన్మించిన తర్వాత తన జీవితమే అఖిల్ అంటూ అక్కినేని కుటుంబానికి పరిమితమైన ఈమె ఆ కుటుంబానికి సంబంధించిన బిజినెస్ పనులు కూడా చూసుకుంటోంది. దీనికి తోడు అడపాదడపా సినిమాలలో.. క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉంది అనిపిస్తే నటిస్తోంది కూడా.. శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక్క జీవితం సినిమాలో శర్వానంద్ తల్లి క్యారెక్టర్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా అమలకి భారీ స్థాయిలో పాపులారిటీతో పాటు అభిమానులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా అమలకు సంబంధించిన ఒక వార్త ఆమె అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.


వేలకోట్లు ఉన్నా ఆ వ్యాధి కారణంగా అనుభవించలేకపోతున్న అమల..

సాధారణంగా వేలకోట్ల ఆస్తులు ఉన్నా సరే.. సెలబ్రిటీలు చాలా సింపుల్ గా కనిపిస్తారు. అయితే మరికొంతమంది తమ పరపతిని చూపించుకుంటారు. అయితే అమలు మాత్రం ఎప్పుడూ అలా కాదు. చాలా సింపుల్ గా.. హోమ్లీ గా అందరితో కలిసిపోయి అందరిని మెప్పిస్తోంది. కనీసం మెడలో పుస్తెలతాడు కూడా ఆమె వేసుకోదు. నల్లపూసల దండ మాత్రమే ధరిస్తూ ఉంటుంది. దానికి కారణం ఒక సమస్య ఉందట. అమల బంగారం వేసుకుంటే అలర్జీ వస్తుందట. ఇది చాలా తక్కువ మందికి వచ్చే వ్యాధి అని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అక్కినేని అమలకు బంగారం అంటే చాలా ఇష్టమట. కానీ బంగారం వేసుకుంటే ఒళ్లంతా రాషెస్ వస్తాయని సమాచారం . అలర్జీ లాగా పాకిపోయి ఆమె అవస్థలు పడుతుందట. ఈ నేపథ్యంలోనే తనకు ఇష్టమైన బంగారాన్ని ఆమె ధరించలేకపోవడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా ఈమె ఈ సమస్య నుంచి బయటపడలేకపోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

అదృష్టం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్..

వేలకోట్ల ఆస్తి ఉన్నా సరే.. కనీసం పుస్తెలతాడు వేసుకోవడానికి కూడా లేకుండా పోయింది అంటూ ఆమె అభిమానులు నిట్టూరుస్తున్నారు. మరి కొంతమంది ఆమె సింప్లిసిటీ అంటూ కొట్టు పడేస్తున్నారు. ఎంత ఆస్తి ఉన్నా అనుభవించడానికి అమలకు అదృష్టం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×