BigTV English

Jr NTR: నమ్మలేకపోతున్నా.. వార్ 2 కంబ్యాక్‌‌పై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Jr NTR: నమ్మలేకపోతున్నా.. వార్ 2 కంబ్యాక్‌‌పై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)తాజాగా బాలీవుడ్ చిత్రం వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో కొంతమేర అభిమానులలో నిరాశ కలిగింది కానీ, రెండో రోజు మాత్రం ఊహించిన విధంగా కలెక్షన్లు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉండేవి కానీ విడుదలకు ముందు రజనీకాంత్ కూలీ(coolie) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.


కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న వార్ 2…

ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో కూలీ సినిమాపై ఉన్న బజ్ చూసిన అభిమానులు కూలీ సినిమా ముందు వార్ 2 తేలిపోతుందని , వార్ వన్ సైడే అది కూలీ సైడే అంటూ రిలీజ్ కు ముందు కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు విడుదలైనప్పుడు మొదటి రోజు కూలీ సినిమాకు మంచి కలెక్షన్లు రావడంతో ఎన్టీఆర్ కు ఈ సినిమా నిరాశ కలిగించిందని అభిమానులు కూడా భావించారు కానీ ఊహించిన విధంగా రెండో రోజు ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. వార్ 2 కి మొదటి రోజు 56 కోట్ల కలెక్షన్లు రాగా, రెండో రోజు మాత్రమే 60 కోట్లు మేరా కలెక్షన్లను రాబట్టింది. ఇలా మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.


ఈ మద్దతును నమ్మలేకపోతున్నా…

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..” వార్ 2 సినిమాపై మీకున్న ప్రేమను చూస్తున్నాను. అలాగే నేను కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మేము చాలా ఫ్యాషన్ తో ఈ సినిమాని మీ ముందుకు తీసుకువచ్చాము.. ఈ సినిమాకు మీరు చూపిస్తున్న మద్దతును నమ్మలేకపోతున్నాను” అంటూ ఈయన ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి అయితే 25 సంవత్సరాల సినీ కెరీర్ లో మొదటిసారి ఈయన బాలీవుడ్ సినిమాకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పక్కా హిట్ కొడుతుందని ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఎన్టీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా సినిమా పట్ల చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Also Read: Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Related News

Anil Sunkara: 1 – నేనొక్కడినే… దూకుడు రికార్డులన్నీ కొడదాం అని ప్లాన్ చేశాం

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ, మరో కీలకమైన మీటింగ్

Koratala Siva: దేవర 2 సినిమా లేనట్లేనా, నాగచైతన్యకు కథ చెప్పిన కొరటాల

Social Look: దిశా పటానీ అందాల అరాచకం.. రెడ్‌ డ్రెస్‌లో రెజీనా హాట్‌ లుక్స్‌

Ram Gopal Varma: మీ లాబ్రడార్, హస్కీలతో వీధి కుక్కలకు పెళ్లి చేయండి.. డాగ్‌ లవర్స్‌కి ఆర్జీవీ మరో కౌంటర్‌..

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Big Stories

×