Trivikram – Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గొప్ప డైలాగ్ రైటర్ గా పేరు సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ముఖ్యంగా ఈయన సినిమాలు ఒక రేంజ్ ని అందుకుంటాయి అంటే.. అందులో ఆయన పెట్టే డైలాగ్స్ మరో రేంజ్ అందుకుంటాయి అనడంలో సందేహం లేదు. అంతలా ఎప్పటికప్పుడు తన మార్క్ చూపిస్తూ.. ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు త్రివిక్రమ్. ఇకపోతే గత కొంతకాలంగా మిగతా డైరెక్టర్ల సినిమాలపై ఫోకస్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు నేరుగా విక్టరీ వెంకటేష్ (Venkatesh ) తో సినిమా అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకి త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అని అందరిలో ఆసక్తి నెలకొంది.
వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ.. పరిశీలనలో ఆ టైటిల్
వాస్తవానికి త్రివిక్రమ్ తన సినిమాలపైనే కాదు టైటిల్స్ పెట్టడంలో కూడా ఒక ట్రెండ్ సృష్టించారు. ఇప్పటివరకు అత్తారింటికి దారేది, అలవైకుంఠపురంలో, అరవింద సమేత వీర రాఘవ ఇలా టైటిల్స్ లోనే తన మార్క్ చూపించాడు త్రివిక్రమ్. ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే ఆసక్తి అందరిలో రేకెత్తుతోంది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విక్టరీకి సింబల్ V.. టైటిల్ కూడా ఇదే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉందని, ఈసారి కూడా అచ్చమైన తెలుగు పేరే త్రివిక్రమ్ పెట్టబోతున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిష (Trisha Krishnan), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) పేర్లు పరిశీలనలో ఉన్నాయి.. ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
15 ఏళ్ల తర్వాత మళ్లీ గుర్తు చేస్తున్న త్రివిక్రమ్..
ఇక టైటిల్ విషయానికి వస్తే..’# వెంకీ 77′ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమాకి ఈ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు రావడంతో త్రివిక్రమ్ 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పేరును గుర్తు చేస్తున్నారు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి 2010లో నమో వెంకటేశ అనే సినిమా చేశారు వెంకటేష్. ఇందులో వెంకీ పేరు వెంకటరమణ. ఇందులో హీరోయిన్ గా త్రిష చేసింది . డైరెక్టర్గా శ్రీనువైట్ల చేశారు. ఇప్పుడు ఇదే పేరును త్రివిక్రమ్ టైటిల్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మళ్లీ త్రివిక్రమ్ తన టైటిల్స్ తో ఒక మార్క్ సెట్ చేయబోతున్నారని చెప్పవచ్చు.
వెంకటేష్ సినిమాలు..
వెంకటేష్ విషయానికి వస్తే.. ఈ ఏడాది అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi ) హీరోగా వస్తున్న ‘మెగా 157’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మరొకవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేష్. మరి ఈ సినిమాతో వెంకీ ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటారో చూడాలి.
also read: Coolie film: కాసేపట్లో కూలీ మార్నింగ్ షో.. ఇంతలోనే థియేటర్‌ను ముంచేసిన వరద!