Nagarjuna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అఖిల్ ఒకరు. సిసింద్రీ సినిమాలో నటించిన అఖిల్ అందరినీ విపరీతంగా ఆశ్చర్యపరిచాడు. అప్పటినుంచి అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూశారు. సినిమాల్లోకి హీరోగా ఎంటర్ రావడానికి అంటే ముందు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో క్రికెట్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక స్టేజిలో అఖిల్ మంచి క్రికెటర్ అయిపోతాడు అని అందరూ అనుకున్నారు.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా అక్కినేని ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైనది. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా ఆ సినిమాలో నటించారు. ఒక సినిమా అయిపోతుంది అనుకున్న తరుణంలో అక్కినేని అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడితో అఖిల్ మీద ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కనిపించింది కొద్దిసేపు అయినా కూడా ఆ సీన్ లో అఖిల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిదే.
జగపతిబాబుని పిలవకండి
అఖిల్ సినిమాతో అఖిల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్ నిర్మించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే అఖిల్ సినిమాలోని ఒక పాత్ర కోసం జగపతిబాబుని అడుగుదామని నాగర్జునకు చెప్పారట. వెంటనే నాగర్జున అది చాలా చిన్న పాత్ర అటువంటి పాత్ర కోసం చౌదరిని అడగకండి. అతను కలిసేదే చాలా తక్కువ మరీ ఇంత చిన్న పాత్రకు ఆయనను అడగకండి పరువు పోతుంది అంటూ నాగార్జున మాట్లాడారట. ఈ విషయంపై జగపతిబాబు స్పందిస్తూ నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. థాంక్యూ వెరీ మచ్ అంటూ నాగార్జునకు చెప్పాడు జగపతిబాబు.
సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్
ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు జగపతిబాబు. తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. హీరోగా కూడా సినిమాలు చేశారు. హీరోగా సినిమాలు చేస్తున్న తరుణంలో మంచి సక్సెస్ కూడా సాధించాయి. అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జగపతిబాబు సినిమాలు కూడా ఆడడం మానేశాయి. ఆల్మోస్ట్ జగపతిబాబు పని అయిపోయింది అనుకున్న తరుణంలో ఒక ఫోటో షూట్ కోసం తీసిన ఫోటోలు లెజెండ్ సినిమాలో విలన్ పాత్రకు అవకాశాన్ని తీసుకొచ్చాయి.
ఆ సినిమాలో విలన్ పాత్ర వేసిన తరువాత జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ తెలుగులో పవర్ఫుల్ విలన్ పేరు అనగానే గుర్తొచ్చేది జగపతిబాబు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాల్లో తన నటన అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం కూడా తెలుగులో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా జగపతిబాబును వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి.
Also Read: Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’ కి వ్యతిరేకంగా మెసేజ్ ఇచ్చే ఒక ఫైట్