E-Paper
Advertisement

Comedian Ali: పవన్ తోనే బావుంటుంది.. మనసు విప్పిన ఆలీ

Comedian Ali: పవన్ తోనే బావుంటుంది.. మనసు విప్పిన ఆలీ
Advertisement

Comedian Ali latest news(Today tollywood news): ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమంది స్నేహితుల గురించే కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి స్నేహితుల లిస్ట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మూడ్ను వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ఆలీకి మధ్య ఉన్న స్నేహ బంధం ఇప్పటిది కాదు.

తొలిప్రేమ దగ్గర నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ వరకు.. ఆలీ లేని పవన్ సినిమాను ఊహించలేము అంటే అతిశయోక్తి కాదు. ఇక వీరి స్నేహానికి రాజకీయం అడ్డుపడింది. మొదటి నుంచి ఆలీ.. వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. జగన్ ఏదైనా పదవి ఇవ్వకపోతాడా అన్న నమ్మకంతో అలానే ఉండిపోయాడు. పవన్.. జనసేన పార్టీని స్థాపించినప్పుడు.. బెస్ట్ ఫ్రెండ్ కోసం కూడా ఆలీ వైసీపీని వదిలి రాలేదు.

Advertisement

ఇక ఈ రాజకీయాల నడుమ తమ స్నేహం పాడవ్వకూడదు అని.. పవన్, ఆలీని దూరం పెట్టినట్లు సమాచారం. ఇక దీంతో వీరి మధ్య దూరం పెరిగింది. నిజం చెప్పాలంటే.. ఆలీ వైసీపీ లో ఉన్నా కానీ, ఏనాడు పవన్ ను దూషించలేదు. పవన్ సైతం, ఆలీ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇక రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఆ స్నేహ బంధాన్ని వీరిద్దరూ కొనసాగిస్తున్నట్లు ఆలీ చెప్పకనే చెప్పుకొచ్చాడు.

ఆలీ కూతురు పెళ్లికి పవన్ వస్తాడని అనుకున్నారు. కానీ, రాలేదు. అయితే పవన్ ను తానే స్వయంగా పిలిచాను అని, ఆయన అప్పుడు ప్రచారంలో ఉండడంతో రాలేకపోయాడని తెలిపాడు. ఇక పదేళ్ల తరువాత పవన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా మారాడు. ఇక ఈ మధ్యనే వైసీపీ నుంచి కూడా ఆలీ బయటకు వచ్చేశాడు. తాను ఇంక రాజకీయాల జోలికి పోను అని కూడా తెలిపాడు. దీని తరువాత మొదటిసారి ఆలీ.. పవన్ గురించి మాట్లాడాడు.

Advertisement

సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షోలో పాల్గొన్న ఆలీకి.. సుమ ఒక చిక్కు ప్రశ్న వేసింది. ఆన్ స్క్రీన్ లో ఈ హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు ఇష్టం.. రవితేజ లేక పవన్ కళ్యాణ్ అని అడగ్గా.. తడుముకోకుండా ఆలీ పవన్ పేరు చెప్పడం విశేషం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. దీంతో పవనే బెస్ట్ అని ఆలీ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×