BigTV English

Vishnu Temples in India: దేశంలోని 5 ప్రసిద్ధ విష్ణు దేవాలయాలు, విశిష్టత

Vishnu Temples in India: దేశంలోని 5 ప్రసిద్ధ విష్ణు దేవాలయాలు, విశిష్టత

Vishnu Temples in India: హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువును లోక రక్షకుడిగా చెబుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమహా విష్ణువును ముందుగా పూజిస్తూ ఉంటారు. హరి అనుగ్రహం ఎవరిపై కురుస్తుందో వారి పట్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న మానవ జీవితంలో దేనికి లోటు ఉండదు.


జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవించిన తర్వాత అతను చివరకు శ్రీహరి పాదాల వద్ద చోటు పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అతంటి మహిమ కలిగిన విష్ణు ఆలయాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అందులో 5 విష్ణుదేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బద్రీనాథ్ దేవాలయం (ఉత్తరాఖండ్):


హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఛార్ థామ్ యాత్ర చేయాలని అనుకుంటారు. చార్ థామ్ యాత్రలోని పవిత్ర పుణ్య క్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి. హిందూ పురాణాల ప్రకారం , శ్రీ విష్ణువు యొక్క 24 రూపాల్లో ఒకటి బద్రీనాథ్ అవతారం అని చెబుతారు. ఏ ఆలయ తలుపులు అయినా ఒక తాళపు చెవి ద్వారా తెరుస్తారు. కానీ బద్రీనాథ్ తలుపులు మాత్రం మూడు తాళపు చెవిల ద్వారా తెరవబడుతుంది. బద్రీనాథ్ ఆలయం గురించి మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆలయం ఆరు నెలల పాటు మాత్రమే తెరుచుకుని ఉంటుంది. మరో ఆరు నెలలు భక్తుల దర్శనాలను నిలిపివేస్తారు. విదేశాల నుంచి కూడా ఉత్తరాఖండ్‌కు భక్తులు వస్తుంటారు.
పద్మనాభస్వామి ఆలయం (కేరళ):
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో విష్ణుమూర్తి నిద్రిస్తున్న భంగిమలో  ఉంటాడు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఆలయం దేశంలోనే గొప్ప దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఆలయ గర్భగుడిలోనే శ్రీహరి విగ్రహం లభించిందని చెబుతుంటారు. సాంప్రదాయమైన దుస్తుల్లో ఉన్న స్త్రీ, పురుషులకు మాత్రమే ఈ ఆలయంలోకి అనుమతి ఇస్తారు. ఈ ఆలయం అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతోంది. ఈ ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు,బంగారు విగ్రహాలు ఉన్నాయని చెబుతుంటారు.

Also Read: తొలి ఏకాదశి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు

పండరీపుర ఆలయం (మహారాష్ట్ర):
మహారాష్ట్రలో ఉన్న ప్రసిద్ధ విష్ణు దేవాలయం పండరీపుర ఆలయం. షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో ఈ ఆలయం ఉంది. భీమా నది ఓడ్డున ఉన్న ఈ ఆలయంలో విష్ణువు కొలువుదీరి ఉన్నాడు. ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తారు. భీమా నదిలో స్నానాలు ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వెనకబడిన కులాలకు చెందిన వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×