E-Paper
Advertisement

Poonam Pandey: పూనమ్ పాండేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. కారణం ఇదే..?

Poonam Pandey: పూనమ్ పాండేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. కారణం ఇదే..?
Advertisement

Police case against Poonam Pandey: బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే శుక్రవారం ఉదయం సర్త్వెకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని ఆమె టీం ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా సినీ ప్రియులు షాక్ అయ్యారు. ఆమె మరణ వార్త అందరినీ తీవ్రంగా కలచవేసింది. ఆమె అభిమానులు, స్నేహితులు, మరికొంతమంది సన్నిహితులు ఇది నిజమేనని నమ్మారు. ఇక టీవీలు, యూట్యూబ్‌లు, సోషల్ మీడియాలో కూడా ఆమె మరణ వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

అంతేకాకుండా ఆమె బాడీ కనిపించక పోవడం, ఈ విషయంపై పూనమ్ కుటుంబ సభ్యులు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయకపోవడంతో అనేక అనుమానాలకు దారితీశాయి. అయితే నాలుగు రోజుల క్రితం వరకు ఎనర్జిటిక్‌గా కనిపించిన పూనమ్ సడెన్‌గా గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయారంటే నమ్మడానికి చాలామందికి కాస్త సమయం పట్టింది.

Advertisement

అయితే పూనమ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్న క్రమంలో అందరినీ షాకింగ్‌కి గురిచేసే వీడియో ఒకటి వచ్చింది. అయితే ఆ వీడియో షేర్ చేసింది పూనమ్ పాండే కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోలో.. తాను బతికే ఉన్నానని.. తనకు ఎలాంటి గర్భాశయ క్యాన్సర్ రాలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎందరో మహిళలు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన లేకపోవడంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని తెలిపింది. అందువల్లనే ఈ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది.

దీనిపై కొందరు నెటిజన్లు, అభిమానులు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం ఇలాంటి తిక్క పనులు చేయడం సరైన పద్దతి కాదని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియోషన్ ఆమెపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

కేవలం గర్భాశయ క్యాన్సర్ అవగాహన కోసం ఇలా చేశారు. కాగా ఇప్పటికీ పూనమ్ పాండే చనిపోయిందని ఎంతో మంది అభిమానులు, సన్నిహితులతో పాటు మరెంతోమంది కన్నీళ్లు పెట్టుకొని నివాళులర్పించారు. ఇక ఆమె రిలీజ్ చేసిన వీడియోతో ఇదంతా ఫేక్ అని తెలిసి వారంతా చాలా హర్ట్ అయ్యారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×