BigTV English

Royal Enfield at Rs 18,000: రూ.18700కే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్..!

Royal Enfield at Rs 18,000: రూ.18700కే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్..!

Royal Enfield : రాయ్ ఎన్‌ఫీల్డ్.. ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది డుగు డుగు సౌండ్. ఈ బైక్ డ్రైవ్ చేస్తే వచ్చే కిక్కే వేరు. యూత్‌‌కి వీటిపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. లైఫ్‌లో ఒక్కసారి అయిన నడపాలని అనుకునే వారు చాలా మంది ఉంటారు. యూత్ డ్రీమ్ బైకుల్లో ఇది కూడా ఉంటుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలో 350 క్లాసిక్ మోడల్ భారతీయ బైక్ ప్రేమికుల మనసు కొల్లగొడుతుంది. ఈ 350 మోడల్ గురించి ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


భారత్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ప్రస్తుతం రూ. 1.9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే 1986లో ఈ మోడల్ బైక్ ధర కేవలం రూ.18,700 మాత్రమేనట. దీనికి సంబంధించిన ఓల్డ్ బిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో బైక్‌లు ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు బైక్‌లు ఇష్టపడేవారు పెరిగారు. వాటి వినియోగం ఒక్కసారిగా పెరిగింది. యువత ఇష్టపడే బైక్‌లలో రాయల్ ఎన్‌‌ఫీల్డ్ మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ మోడల్ బైక్ దేశంలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ నిరంతరం అభివృద్ధి చెందుతూ వస్తోంది. కానీ బైక్ రూపాన్ని మాత్రం అలానే కొనసాగిస్తున్నారు.


రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్ర కూడా చాలా పెద్దదే. ఇంగ్లాండ్‌‌లో వోర్సెస్టర్ షైర్,రెడ్డిచ్‌కు చెందిన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తొలిసారిగా తయారు చేసింది. ఆ తర్వాత కాలంలో భారత్ కార్ల తయారీ కంపెనీ ఐషర్ మెటర్స్ లిమిటెడ్‌లో భాగమై మద్రాస్ మోటర్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లైసెన్స్ పొందింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను ఎక్కువగా వాడేవారు.

1954లో గవర్నమెంట్ 800 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ మోడల్ బైకులను కొనుగోలు చేసింది. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ బైకులకు ఉండే క్రేజ్. 1986 జనవరి 23న ఝార్ఖండ్‌లో బొకారోలోని సందీప్‌ ఆటో కంపెనీ అనే డీలర్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైక్‌ను రూ.18700కు విక్రయించింది. ఇప్పడు ఈ పాత బిల్లు నెట్టింట్లో షికారు కొడుతుంది. ఇప్పటి ధరతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆ పాత బిల్లు చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×