E-Paper
Advertisement

Aa Okkati Adakku: సర్లే.. నరేష్ అన్నా.. నీ కామెడీ కోసం ఆ మాత్రం ఆగలేమా.. ?

Aa Okkati Adakku: సర్లే.. నరేష్ అన్నా.. నీ కామెడీ కోసం ఆ మాత్రం ఆగలేమా.. ?
Advertisement

Aa Okkati Adakku: కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. గత కొంతకాలంగా తన పంథా మార్చుకొని సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం.. ఇలా చేసిన సినిమాలు పాజిటివ్ టాక్ ను అయితే అందుకున్నాయి కానీ, విజయాలను మాత్రం అందించలేదు. దీంతో నరేష్ బ్యాక్ టూ కామెడీకి వెళ్ళిపోయాడు. ఇక నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ఆ ఒక్కటీ అడక్కు.

అప్పట్లో నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ టైటిల్ తో నరేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

30 ఏళ్లు దాటినా పెళ్లి కానీ ఒక యువకుడు పడిన బాధకు కామెడీ జోడించి వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎప్పటినుంచో ఈ సినిమా రిలీజ్ వాయిదాలు పడుతూనే ఉంది. ముందు మార్చి అన్నారు.. ఆ తరువాత ఏప్రిల్ అన్నారు. ఇక ఇప్పుడు ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు.

మే 3 న ఆ ఒక్కటీ అడక్కు సినిమా రిలీజ్ అవుతుందని నరేష్ వీడియో ద్వారా తెలిపాడు. సినిమా వాయిదా పడినా కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని, అందరు చూసి ఎంజాయ్ చేస్తారని నరేష్ ధీమాగా చెప్పాడు. దీంతో.. సర్లే.. నరేష్ అన్నా.. నీ కామెడీ కోసం ఆ మాత్రం ఆగలేమా.. ? అని నెటిజన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×