E-Paper
Advertisement

Rathnam Trailer: ఒక అమ్మాయి కోసం ఇంత విధ్వంసమా.. ఏంది విశాల్ బ్రో ఇది..?

Rathnam Trailer: ఒక అమ్మాయి కోసం ఇంత విధ్వంసమా.. ఏంది విశాల్ బ్రో ఇది..?
Advertisement

Rathnam Trailer: గతేడాది మార్క్ ఆంటోనీతో మంచి హిట్ అందుకున్నాడు హీరో విశాల్. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో విశాల్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి రత్నం. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడియోస్, కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత దేవి శ్రీ ప్రసాద్ రత్నం సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. హరి అంటేనే యాక్షన్. ఇక విశాల్ తో అంటే ఈ రేంజ్ లో ఉండడంలో అస్సలు తప్పులేదు. రాజకీయాల మధ్య కొట్టుకుంటున్న ఇరు వర్గాల మధ్యలో ఒక అమ్మాయి ఇరుక్కుంటుంది. ఆ అమ్మాయిని చంపడానికి పెద్ద పెద్ద గ్యాంగ్ లు తిరుగుతూ ఉంటాయి. ఇక ఆమెను కాపాడడానికి ఆమెను ప్రేమించిన రత్నం(విశాల్) రంగంలోకి దిగుతాడు. అసలు ఎందుకు ఆ అమ్మాయిని వారు చంపాలనుకుంటారు.. ? చివరికి రత్నం తనకు ప్రాణంగా భావించిన అమ్మాయిని కాపాడుకున్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

ఇక ఈ చిత్రంలో విశాల్ ప్రేమించిన అమ్మాయిగా ప్రియ భవానీ శంకర్ కనిపించింది. ట్రైలర్ లోనే ఫుల్ మాస్ యాక్షన్ చూపించి హరి యాక్షన్ లవర్స్ కు హైప్ పెంచేశాడు. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్, సముద్రఖని లాంటి పెద్ద పెద్ద నటులే ఉండడంతో సినిమాపై మరింత ఆసక్తి కలుగుతుంది. ఏప్రిల్ 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×