E-Paper
Advertisement

Allu Arjun: గురూజీకి హ్యాండ్ ఇచ్చిన బన్నీ.. రంగంలోకి మరో మాస్ డైరెక్టర్..!

Allu Arjun: గురూజీకి హ్యాండ్ ఇచ్చిన బన్నీ.. రంగంలోకి మరో మాస్ డైరెక్టర్..!
Advertisement

Allu Arjun: త్రివిక్రమ్.. ఈ పేరు వినగానే ప్రేక్షకాభిమానులకు ఓ ఎనర్జీ వస్తుంది. ఒకప్పుడు తన డైలాగులతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేవారు. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద సందడే.. సందడి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఆయన తీసే ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘గుంటూరు కారం’ మూవీ తీశారు. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించుకున్నా.. కథ పరంగా పాత సెంటిమెంట్, రొటీన్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్‌తో కానీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీని తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. కాబట్టి ఎన్టీఆర్‌తో సినిమా అంటే చాలా టైం పడుతుంది. పోనీ బన్నీతో సినిమా చేద్దామన్నా.. ప్రస్తుతం అతడు ‘పుష్ప2’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారంటూ వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. కానీ తాజా సమాచారం. ప్రకారం.. బన్నీ, త్రివిక్రమ్ కాంబో క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ సందర్భంలోనే పుష్ప2 సినిమా తర్వాత బోయపాటి శ్రీను కాంబోలో బన్నీ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతక ముందు బన్నీతో బోయపాటి ‘సరైనోడు’ సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ సమయంలోనే బన్నీతో మరొక సినిమా చేస్తానంటూ చెప్పారు. చాలా కాలం తర్వాత ఈ కాంబోకి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి గీతా ఆర్ట్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. అయితే బన్నీనే హీరో అని మాత్రం ప్రకటించలేదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×