E-Paper
Advertisement

Palla Rajeshwar Reddy : భూబకాసురుడు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధితుల అరిగోస..

Palla Rajeshwar Reddy : భూబకాసురుడు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధితుల అరిగోస..
Advertisement

Palla Rajeshwar Reddy : బీఆర్‌ఎస్ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన భూ కబ్జాలపై బాధితులు నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 996లో ప్లాట్స్ ను పల్లా కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పై కేసు నమోదైంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన భాధితులు ఫిర్యాదు చేశారు. ఈ భూ కబ్జా కేసులో A1గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, A2 గా ఆయన భార్య నీలిమ, A3గా మధుసూదన్ రెడ్డి పేర్లు నమోదయ్యాయి.

కొర్రెముల్ల సర్వే నెంబర్ 996లో ప్లాట్స్ కబ్జా చేసినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. 38ఈ హోల్డర్స్ రిజిస్ట్రేషన్స్ చేశారంటూ కబ్జాకు యత్నం చేశారని బాధితులు అంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత పదేళ్లుగా 200 మందిని పల్లా కుటుంబం నానా ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు. తాము చెప్పిన ధరకు ఇవ్వకపోతే ప్లాట్ దక్కనివ్వమంటూ బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

300 ప్లాట్లలో 160 ప్లాట్లు తక్కువ ధరకే కొనుగోలు చేశారని చెప్తున్నారు. రోడ్లు, పార్క్ ప్లేస్ కబ్జా చేసి ఆస్పత్రి నిర్మాణం చేపట్టారని మరో విషయం బయటపెట్టారు. అనురాగ్ యూనివర్సిటి పేరుతో వందల ఎకరాలు పోగుచేసుకున్న పల్లా ఫ్యామిలీ.. తమ ప్లాట్లను ఆక్రమించారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

గాయిత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో పేదలను బెదిరించి భూములను బలవంతగా లాక్కొన్నారని ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో తన భార్య నీలిమి పేరుతో హెల్త్ అండ్ సైన్స్ కాలేజీలని నిర్మిచారని ఆరోపణలు ఉన్నాయి. వైపు మరో వైపు ఘట్ కేసర్ కొర్రింల గ్రామ పంచాయితీలో 10 ఎకరాల్లోని 150 ప్లాట్స్ ఉన్నాయి. అందులో 100 ప్లాట్స్ ని బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో.. మిగిలిన 50 ప్లాట్స్ ఎదురు తిరిగితే.. చంపుతాని బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఓపెన్ ప్లాట్స్ ఇంటి నిర్మాణాలు చేస్తుంటే జేసీబీలతో నిర్మాణాలు కూల్చి ఓనర్స్ ని చంపుతా అని బెదించినట్టు తెలుస్తోంది.

Advertisement

Tags

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×