E-Paper
Advertisement

Allu Arjun: పవన్ తో క్లాష్.. నీకు పనికిరాదు బన్నీ.. చూసుకో మరి.. ?

Allu Arjun: పవన్ తో క్లాష్.. నీకు పనికిరాదు బన్నీ.. చూసుకో మరి.. ?
Advertisement

Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య అగ్గి రాజుకుందా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. ఎప్పటికప్పుడు వీరి రెండు కుటుంబాల మధ్య విబేధాలు బయటపడిన వెంటనే.. మెగాస్టార్ కానీ, అల్లు అరవింద్ కానీ ఏదో ఒక విధంగా మేనేజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొదటి నుంచి అల్లు అర్జున్.. మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చి స్వతహాగా ఎదగాలని చూస్తున్నాడు. అలానే తనకంటూ ఆ గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు.

కొన్ని సందర్భాల్లో మెగా ఫ్యామిలీ గురించి ఇన్ డైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. అందుకే మెగా ఫ్యాన్స్ ఎప్పుడు బన్నీకి.. మూలాలు మర్చిపోకూడదు అని చెప్పుకొస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సమయంలో బన్నీ చేసిన ఒక చిన్న పని.. ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో పెద్ద అగాధాన్నీ సృష్టించిందని తెలుస్తోంది. అయితే ఈ ఈ వివాదాన్ని ముగించడం బన్నీకి చిటికెలో పని. కానీ, అది అతను చేయకుండా ఇంకా కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు బిహేవ్ చేయడమే మెగా ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు.

Advertisement

పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేయకుండా బన్నీ.. వైసీపీ నేతకు సపోర్ట్ చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది. దానికి అప్పుడే బన్నీ క్లారిటీ ఇచ్చాడు. స్నేహితుడు కాబట్టి.. ఇచ్చిన మాట కోసం వెళ్ళాను అని, కుటుంబ సభ్యుడు పవన్ కే ఎప్పుడు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే కుటుంబ సభ్యుడు కోసం కేవలం ట్వీట్ చేసి.. స్నేహితుడు కోసం ప్రచారంలో పాల్గొనడం ఏంటి.. ? అని నెటిజన్స్ ప్రశ్నలు వేస్తున్నారు. పవన్ గెలిచాకా.. ఏ ఒక్క ఫంక్షన్ లో కూడా అల్లు కుటుంబం కనిపించలేదు.

నిన్నటికి నిన్న పవన్ ప్రమాణ స్వీకారోత్సవం లో కూడా అల్లు కుటుంబం కనిపించలేదు. కనీసం.. పవన్ ను కలిసి విషెస్ చెప్పినట్లు ఒక ఫోటో కూడా లేదు. దీంతో మెగా ఫ్యాన్స్.. దీన్ని బన్నీ ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. అల్లు కుటుంబం మొత్తం పవన్ తో ఒక్క ఫోటో దిగి షేర్ చేస్తే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే కదా.. అంతకుముందు కూడా ఇలా ఎన్నోసార్లు జరిగింది. మరి ఇప్పుడెందుకు బన్నీ చేయడం లేదు అని అనుమానిస్తున్నారు.

Advertisement

పవన్ తో క్లాష్ కు దిగితే.. ఎలా ఉంటుందో బన్నీకి కూడా తెలుసు. ఈ ఎఫెక్ట్ బన్నీ సినిమాలపై పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే పుష్ప 2 వాయిదా పడుతుందని చెప్పుకొస్తున్నారు. రేపు రిలీజ్ రోజున టికెట్ రేట్స్ పెంచాలి అంటే పవన్ దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించకుండా కయ్యానికి కాలు దువ్వితే నష్టం బన్నీకి తప్పదు అని అంటున్నారు. మరి అల్లు అర్జున్ తన అహాన్ని వదిలి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×