E-Paper
Advertisement

Allu Arjun: కల్కి2898AD.. అల్లు అర్జున్ రివ్యూ కూడా వచ్చేసిందిరోయ్

Allu Arjun: కల్కి2898AD.. అల్లు అర్జున్ రివ్యూ కూడా వచ్చేసిందిరోయ్
Advertisement

Allu Arjun: రెండు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు కల్కి 2898AD. తెలుగు చిత్ర పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లే స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని నాగ్ అశ్విన్ ను చూస్తే తెలుస్తోంది. ఇండియాను ప్రపంచానికి పరిచయం చేసిన క్రెడిట్ రాజమౌళి తీసుకుంటే.. ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఆ గుర్తింపును కొనసాగిస్తున్న డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే నాగ్ అశ్విన్ తెరక్కించిన కల్కి.. హాలీవుడ్ ప్రశంసలను అందుకోవడం గర్వించదగ్గ విషయం.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా రెండు రోజులో రూ. 298 కోట్లు సాధించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక అన్ని ఇండస్ట్రీల హీరోలు.. కల్కిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిరంజీవి నుంచి రజినీకాంత్ వరకు.. సూర్య నుంచి యష్ వరకు.. కల్కిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా అందులో చేరిపోయాడు. కల్కికి తనదైన రీతిలో రివ్యూ ఇచ్చేశాడు.

Advertisement

” కుడోస్ కల్కి టీమ్. అద్భుతమైన దృశ్యకావ్యం. ఇలాంటి అద్భుతమైన ఎపిక్ ను అందించినందుకు నా ప్రియా మిత్రుడు ప్రభాస్ గారికి గౌరవంగా అభినందనలు తెలుపుతున్నాను. అమితాబ్ బచ్చన్ గారు సూపర్ హీరోయిక్ ప్రెజెన్స్ మీరు అలరించారు.. మీరు నిజంగా స్ఫూర్తిదాయకం.. మాటలు లేవు. ఇక కమల్ హాసన్ సార్ తదుపరి భాగం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. డియర్ దీపికా పదుకొనే.. మీరు అద్భుతంగా ఉన్నారు. దిశా పటానీ ఎంతో ఎట్రాక్టివ్ గా కనిపించింది.

ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్ & మేకప్‌లో కళాకారులందరికీ మరియు సాంకేతిక సిబ్బందికి అభినందనలు. రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు వైజయంతి ఫిల్మ్స్, అశ్వినీదత్, స్వప్న దత్,ప్రియాంక దత్ మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇక కెప్టెన్ నాగ్ అశ్విన్ గారు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని విస్మయానికి గురి చేసారు. మా తరానికి చెందిన పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్ కు అభినందనలు తెలుపుతున్నాను. చివరగా.. మన భారతదేశ సాంస్కృతిక భావాలతో కూడిన సినిమాను గ్లోబల్ గా చూపించారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×