E-Paper
Advertisement

Pushpa 2 : అల్లు, మెగా ఫ్యాన్ వార్ స్టార్ట్… స్పెషల్ పోస్టర్లతో ఓపెన్ గా ఇచ్చి పడేస్తున్న బన్నీ ఫ్యాన్స్

Pushpa 2 : అల్లు, మెగా ఫ్యాన్ వార్ స్టార్ట్… స్పెషల్ పోస్టర్లతో ఓపెన్ గా ఇచ్చి పడేస్తున్న బన్నీ ఫ్యాన్స్
Advertisement

Pushpa 2 : అల్లు వర్సెస్ మెగా వార్ అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. తాజాగా కొంత మంది అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఏకంగా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి ‘ఎవడు వస్తాడో చూసుకుందాం రండి’ అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో ఈ వివాదం మొదలైంది. ఆ బ్యానర్ల ఫోటోలను షేర్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులు, వాటికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ మెగా అభిమానులు ఎక్స్ వేదికగా గొడవకు దిగుతున్నారు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఆ బ్యానర్లు ఎక్కడ కట్టారు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏపీ ఎలక్షన్స్ లో  ఈసారి పవన్ కళ్యాణ్ కింగ్ (Pawan Kalyan) మేకర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే, ఒక్క అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం ఆపోజిట్ పార్టీ నేతకు సపోర్ట్ చేయడం వివాదాన్ని రేకెత్తించింది. ఈ విషయంపై ఇప్పటిదాకా అల్లు అర్జున్ ఎక్కడా స్పందించలేదు. కానీ తాజాగా విజయవాడలో దీనికి సంబంధించి స్పెషల్ గా బ్యానర్లు వెలిసి, అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా మెగా అభిమానుల దృష్టిని అని చెప్పుకోవాలి. ఆ బ్యానర్లలో ఒకదాంట్లో ‘ఏం పీకలేరు బ్రదర్స్’ అని, మరొక బ్యానర్లో ‘ఏం పీకలేరు బ్రదర్.. ఎవడు వస్తాడో రండిరా’ అని ఉంది. అలాగే ‘మా హీరో అంటే మాకు పిచ్చబ్బా… మా హీరో కి నచ్చితే వస్తాడు, మా వాడి మనసుకు నచ్చితే మన అనుకునే వాడికోసం వస్తాడు’ అంటూ సినిమా రేంజ్ లో డైలాగులు పెట్టి మరీ బ్యానర్లను కట్టారు.

Advertisement

ప్రస్తుతం ఆ బ్యానర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొంతమంది మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ (Allu Arjun) పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదన్న కోపంతో ఆయనను ఓ రేంజ్ లో మెగా అభిమానులు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో ఆ రివేంజ్ ను ఇలా తీర్చుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. మరి ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప 2 : ది రూల్” (Pushpa 2) మూవీ గురించి ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. సుకుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటింది అంటూ నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సమంత, శ్రీ లీల స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా “పుష్ప 2” మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ అల్లు వర్సెస్ మెగా వార్ జరగడం, ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడం అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×