BigTV English

Telangana University : యూనివర్సిటీల ప్రక్షాళనకు సీఎం రేవంత్ సన్నాహాలు

Telangana University : యూనివర్సిటీల ప్రక్షాళనకు సీఎం రేవంత్ సన్నాహాలు

Telangana University :


⦿ యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలి
⦿ దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేయాలి
⦿ సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలుపెట్టండి
⦿ నూతన వైస్ ఛాన్సలర్లకు సీఎం రేవంత్ సూచనలు

హైదరాబాద్, స్వేచ్ఛ: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగించేలా పనిచేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సల‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు. శనివారం రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల నూత‌న వైస్ ఛాన్స‌ల‌ర్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సంధ‌ర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ, కొంత కాలంగా యూనివర్సిటీల‌ పైన నమ్మకం తగ్గుతోందని అన్నారు. వాటికి గౌరవాన్ని పెంచాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాల‌ని సూచించారు. యూనివర్సిటీల‌ ప్రస్తుత పరిస్థితిపైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని చెప్పారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని అన్నారు.


వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితంతో పోస్ట్‌లు ఇవ్వలేదని, మెరిట్, సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగానే వైస్ ఛాన్స‌ల‌ర్ల‌ను ఎంపిక చేసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాబ‌ట్టి బాగా ప‌నిచేసి ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌ని సూచించారు. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుందని, దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కూడా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. యూనివర్సిటీలను వంద శాతం ప్రక్షాళన చేయాలని, గతంలో వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేద‌న్నారు. మ‌త్తు పదార్థాల‌ విక్రయాలపైన దృష్టి సారించాలని, అలాంటి అల‌వాట్లు ఉన్న‌ విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు సీఎం.

ALSO READ : ఇందిరమ్మ ఇళ్లకో యాప్

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×