E-Paper
Advertisement

Allu Arjun: వయనాడ్ బాధితుల కోసం ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. రూ.25 లక్షల ఆర్థిక సాయం

Allu Arjun: వయనాడ్ బాధితుల కోసం ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. రూ.25 లక్షల ఆర్థిక సాయం
Advertisement

Wayanad landslide: కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లా ప్రస్తుతం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ జిల్లాను భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయి. ఈ ఊహించని విపత్తు ఎంతో మందిని బలితీసుకుంది. మరెన్నో కుటుంబాలకి గూడునీడ లేకుండా చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది మరణించారు. ఇప్పటికీ 340 మందికి పైగా చనిపోయారు. మరెందరో శిథిలాల కింద సజీవ సమాధి అయిపోయారు. ఇంకొందరు హాస్పిటల్‌లో కొట్టిమిట్టాడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సినీ, రాజకీయ ప్రముఖులు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో వయనాడు బాధితుల కోసం సినీ ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. వయనాడు బాధితుల కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టాడు.

Advertisement

Also Read: చలించిపోయిన మోహన్ లాల్.. వయనాడ్ బాధితులకు రూ.కోట్లలో విరాళం.. ఆ స్కూల్‌ నిర్మాణానికి హామీ

‘‘వాయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడటం పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను ఇస్తోంది. పునరావాస పనులకు మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను.’’ అంటూ రాసుకొచ్చాడు. బాధితులను ప్రభుత్వం దగ్గరుండి కాపాడాలని కోరాడు. దీంతో బన్నీ చేసిన ఆర్థిక సాయానికి ఆయన అభిమానులు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కాగా వయనాడ్‌లో జరిగిన ఈ మారణకాండ నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది తమ వంతు సాయం చేశారు. కోలీవుడ్ సినీ నటుడు సూర్య, అతడి భార్య జ్యోతిక, అతడి సోదరుడు కార్తీ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల సాయం చేశారు. అలాగే చియాన్ విక్రమ్ రూ.20 లక్షలు అందించాడు. రష్మిక రూ.10 లక్షలు ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్లు అందించారు. ఇలా ఎవరికి తోచిన ఆర్థిక సాయాన్ని వారు వయనాడ్ బాధితులకు అందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×