BigTV English

Mustard Seeds: ఆవాలు వంటల్లో అలంకారం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉంటాయని తెలుసా

Mustard Seeds: ఆవాలు వంటల్లో అలంకారం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉంటాయని తెలుసా

Mustard Seeds: వంటల్లో ఉపయోగించే ప్రతీ పదార్థాలలోను చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. పప్పులు, ఉప్పులు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలు వంటి చాలా రకాల వాటితో శరీరానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉపయోగించే దినుసులతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ప్రతీ వంటలో ఉపయోగించే ఆవాలలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం వంటివి చాలా మేలు చేస్తాయి.


చాలా రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఆవాలు తోడ్పడతాయి. ఇవి చర్మ సమస్యలు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, సోరియాసిస్, శ్వాసకోశ సమస్యలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదంలోను ఆవాలను ఉపయోగిస్తుంటారు. వీటితో ఔషధాలను కూడా తయారుచేస్తారు. ఆవాలలో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడానికి సహకరిస్తాయి. అంతేకాదు తరచూ దంతాల సమస్యలతో బాధపడేవారు కూడా ఆవాలను ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాలు డైట్ కంట్రోల్ చేయడంలోను సహాయపడుతుంది. వీటిని కేవలం ఆయుర్వేదం, వంటల్లోనే కాదు, నిపుణులు కూడా ఆవాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. పంటి నొప్పితో బాధపడేవారు ఆవాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఆవాలు మరిగించిన నీటిని తీసుకుని పుక్కిలించి ఉమ్మితే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు గాయాలు త్వరగా మానడానికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాల పొడిని గాయాలపై పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.


కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు ఆవాలను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. టీ స్పూన్, కర్పూరం వంటి వాటితో ఆవాల పొడిని కలిపి మెత్గా పేస్ట్ చేసి కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి. ఆవాల్లో ఉండే సెలీనియంతో థైరాయిడ్ పనితీరు చక్కగా జరుగుతుంది. ఆవాల్లో ఉండే ప్రోటీన్స్ తో కండరాలను బలోపేతం చేసేలా సహాయపడతాయి. అంతేకాదు ఆవ పిండిని ఉపయోగించడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Effects of Makeup: ప్రతిరోజూ మేకప్ వేసుకుంటున్నారా? అయితే మీ చర్మానికి ముప్పే!

Black Tomatoes: నల్ల టమాటాలు కూడా ఉన్నాయా? దీన్ని తింటే ఇన్ని లాభాలా !

Skin Cancer: గాయాలు త్వరగా నయం కావడం లేదా ? ఇదే కారణం కావొచ్చు !

Rose Petals: గులాబీ రేకులను ఇలా వాడితే.. చందమామ లాంటి చర్మం మీ సొంతం !

Nail Fungus: గోళ్లపై ఫంగస్.. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణాలేంటి ?

Immunity in Monsoon: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిందా ? వీటితో ప్రాబ్లమ్ సాల్వ్

Big Stories

×