BigTV English

Allu Arjun: మనుషులు అన్నాక తప్పు చేస్తారులే మావా.. మరీ దీన్ని కూడా ట్రోల్ చేయాలా.. ?

Allu Arjun: మనుషులు అన్నాక తప్పు చేస్తారులే  మావా.. మరీ దీన్ని కూడా ట్రోల్ చేయాలా.. ?


Allu Arjun:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి నుంచి పుష్ప వరకు 21 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో మలుపులు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చింది.  దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం పెట్టేవరకు ఆయన స్థాయి అంచలంచలుగా ఎదిగింది. నేడు దుబాయ్ లో మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహ ప్రతిష్ట జరిగింది. దీనికోసం అల్లు అర్జున తన కుటుంబంతో సహా దుబాయ్ కు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పటికే దుబాయ్ లో అల్లు కుటుంబం  నగరాన్ని చుట్టేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇకపోతే తన మైనపు విగ్రహంతో నిలబడిన ఫోటోను బన్నీ షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “ఈరోజు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహావిష్కరణ.. ప్రతి నటుడుకు ఇదొక మైలు రాయి” అని  అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. ఇక ఇక్కడవరకు ఓకే కానీ .. ఆ పోస్ట్ లో బన్నీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేయడంతో ట్రోలర్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. లాంచ్ కు బదులు లంచ్ అని రాసుకొచ్చాడు. అంటే ఇంగ్లీష్ లో LAUNCH కు బదులు LUNCH అని రాసాడు. ఆ తరువాత వెంటనే తప్పు సరిద్దిదుకొని కరెక్ట్ స్పెల్లింగ్ తో మరోసారి పోస్ట్ పెట్టాడు.


ఇక ఇదే అదునుగా భావించిన  ట్రోలర్స్ తమ చేతికి పనిచెప్పారు. అది లంచ్ కాదు లాంచ్ అని సున్నితంగా చెప్పగా.. ఇంకొందరు మాత్రం స్పెల్లింగ్ రానివాడివి ఎందుకురా ఇంగ్లీష్ అని, ఇంగ్లీష్ రాకుండానే ఐకాన్ స్టార్ అయ్యావా.. ? అని, స్పెల్లింగ్ కూడా రాదు.. ఈయనకు ఎందుకు విగ్రహం అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెటిజన్స్ మాత్రం సర్లే సర్లే..  మనుషులు అన్నాక తప్పు చేస్తారులే మావా.. మరీ దీన్ని కూడా ట్రోల్ చేయాలా.. ? అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే  బన్నీ సినిమాలు విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

 

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×