Big Stories

Bullet Train: బుల్లెట్ ట్రైన్ పరుగులు తీసే ట్రాక్ ఇదే.. వీడియో రిలీజ్

bullet trainBullet Train: దేశ ప్రజలకు త్వరలోనే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో ఈ బుల్లెట్ రైలును కేంద్ర ప్రభుత్వం తొలి సారిగా ప్రారంభించనుంది. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ కోసం భారతీయ రైల్వే శాఖ కొత్త రకం ట్రాక్ ను నిర్మిస్తున్నది.

- Advertisement -

దేశంలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్వీట్టర్(ఎక్స్) ఖాతా ద్వారా విడుదల చేశారు. దేశంలో నిర్మితం అవుతున్న తొలి బుల్లెట్ ట్రాక్ కావడంతో దానికి సంబంధించిన అన్ని వివరాలను ఆ వీడియోలో వెల్లడించారు.

- Advertisement -

ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ట్రాక్ గురించి పూర్తి సమాచారం వీడియోలో అందించారు. బుల్లెట్ ట్రైన్ దృశ్యాలను యానిమేషన్ రూపంలో వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం 508 కిలీమీటర్లు మేర ఈ ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

మేకిన్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఈ ట్రాక్ నిర్మాణ పనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ట్రాక్ కోసం గతంలో లాగ కంకర, కాంక్రీట్ కోణాలు అవసరం లేదని వెల్లడించారు. హై స్పీడ్ రైళ్ల బరువును మోసేందుకు వీలుగా కొత్త రకం ట్రాక్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కొత్త రకం ట్రాక్ లో ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి 153 కిమీ మేర వయాడక్ట్ పనులు పూర్తి అయ్యాయన్నారు. ఇంతే కాకుండా 295.5 కిలోమీటర్లు మేర పీర్ వర్క్ కూడా రైల్వే అధికారులు పూర్చి చేసినట్లు వివరించారు. స్పెషల్ జేస్లాబ్ బాలస్ట్ లెస్ ట్రాక్ సిస్టమ్ ఈ బుల్లెట్ ట్రైన్ కోసం వినియోగిస్తున్నామన్నారు. ఈ ట్రాక్ లో ప్రధానంగా నాలుగు భాగాలుంటాయని తెలిపారు. ఆర్సీ ట్రాక్ బెడ్, కాంక్రీట్ ఆస్ఫహాల్ట్ మోర్టార్ లేయర్, ఫాస్టెనర్ లతో ప్రీ-కాస్ట్ స్లాబ్, పట్టాలతో కలిసి ట్రాక్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Lokhsabha Elections 2024: 238 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు.. తగ్గేదేలే అంటూ మరోసారి సై అంటున్నాడు

వీడియో ఆధారంగా ప్రస్తుతం దేశంలో రెండు చోట్ల ప్రీ-కాస్ట్ ఆర్సీ ట్రాక్ స్లాబ్ లను తయారుచేస్తున్నామన్నారు. గుజరాత్ లోని ఆనంద్, కిమ్ ప్రాంతాల్లో వీటి తయారీ జరగుతుందని వెల్లడించారు. ప్రస్తుతానికి 35వేల మెట్రిక్ టన్నుల పట్టాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News