E-Paper
Advertisement

Allu Arjun: వినాయకుడికి పూజ చేసిన అల్లు అర్హ..ఎంత క్యూట్ గా ఉందో..

Allu Arjun: వినాయకుడికి పూజ చేసిన అల్లు అర్హ..ఎంత క్యూట్ గా ఉందో..
Advertisement

Allu Arjun posted video of his daughter Arha: మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా..డ్యాన్సులు, ఫైట్ల లో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన ఐకాన్ స్టార్ గా నిలిచాడు స్టయిలిష్ హీరో అల్లు అర్జున్.పుష్ప మూవీలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 మూవీ కోసం ఎప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చిన పాటలు, టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఎప్పటికప్పుడు వార్తలలో నిలిచే అల్లు అర్జున్ రీసెంట్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల సాయం అందించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి గానూ టాలీవుడ్ లో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోగా వార్తలలోకి ఎక్కారు. రూ.14 కోట్ల మేరకు ట్యాక్స్ కట్టిన హీరో అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని ప్రేమిస్తారు. ముఖ్యంగా కూతురు అర్హ అంటే అల్లు అర్జున్ కి ఎంతో ప్రేమ.

అర్హ పై అమిత ప్రేమ

Advertisement

చిన్నప్పటినుంచే అర్హ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవారు.అర్హ చేసే అల్లరి పనులు, చిలిపి పనులు, ముద్దు మాటలతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. అయితే నటి సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం మూవీలో అర్హ నటించింది. అయితే తర్వాత ఏ మూవీ కూడా ఒప్పుకోలేదు. అది కూడా ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ ని ఒప్పించి మరీ నటింపజేశారు. సోషల్ మీడియాలో అర్హ కు ఫాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా అర్హ కు చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్ గా ఆగస్టు 15 స్వాతం త్ర్య దినోత్సవం సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు తన తాత అల్లు అరవింద్ తో కలిసి హాజరయింది. అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొంది. తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ వినాయకచవితి రోజున అర్హ పూజలో పాల్గొంది. చక్కగా అమ్మమ్మతో కలిసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెంటనే ఆ వీడియో కాస్తా మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అభిమానులు కూడా తమ అభిమాన హీరో కుమార్తె క్యూట్ వీడియో చూసి మురిసిపోతున్నారు.

కుటుంబానికి ప్రాతినిధ్యం

Advertisement

అల్లు అర్జున్ వ్యక్తిగతంలో ఎంత బిజీలో ఉన్నప్పటికీ పండుగలు, ప్రత్యేక దినాలలో ఫ్యామిలీకి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తారో దీన్న బట్టి తెలుస్తోందని అంటున్నారు. అల్లు అర్జున్ కేవలం హిందూ పండుగలకే కాదు క్రిస్మస్ పండుగను సైతం ఇంట్లో ఎంజాయ్ చేస్తారు. గతంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా గెట్ టూ గెదర్ ఫంక్షన్ కూడా జరుపుకోవడం విశేషం. అయితే వినాయక చవితి సందర్భంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హ వీడియోను పోస్ట్ చేయడమే కాదు..రెండు తెలుగు రాష్ట్రాల తన అభిమనులు, ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాలలో సరికొత్త వెలుగులు తీసుకురావాలని..అందరి ఇంటా సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీనితో ఇది కదా మాకు అసలైన వినాయక చవితి..త్వరలో తమ అభిమాన హీరో నటించిన పుష్ప 2 మూవీ మొదటి భాగం కన్నా మరింతగా హిట్ అవ్వాలనీ కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×