BigTV English

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. 8 మంది మృతి

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. 8 మంది మృతి

3-storey building collapses in Lucknow.. 5 killed; several injured: దేశమంతటా వినాయక చవితి వేడుకల వేళ ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూపీ రాజధాని లక్నో పరిధిలోని ట్రాన్స్ పోర్ట్ నగర్ లో నిర్మాణ దశలో ఉన్న మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో వందలాది మంది భవన శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. 30 మందికి పైగా బయటపడ్డారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవనానికి సంబంధించిన మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఉన్నట్లుండి పిల్లర్లు విరిగిపోయాయి. దీనితో భవనం పెద్ద శబ్ధం చేస్తూ కూలిపోయింది.


సకాలంలో స్పందన

సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెస్క్కూ బృందాలు అక్కడికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ ఘటనపై సీఎం ఆదిత్యానాధ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని..వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ప్రమాదానికి జరిగిన కారణాలు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని..ఎంతటి వారినైనా వదిలేది లేదని..ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని.పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చామని అన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ దుర్ణటన జరిగినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×