E-Paper
Advertisement

Allu Arjun: అది జరగకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా..

Allu Arjun: అది జరగకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా..
Advertisement

Allu Arjun: మెగా హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ ఎప్పుడో బయటపడ్డాడు. చిరంజీవి డాడీ సినిమాలో ఒక చిన్న కుర్రాడిగా కనిపించిన బన్నీ.. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆ ఫేస్ చూసి అభిమానులు హీరోలానే లేడు అని ట్రోల్ చేశారు. వాటిని పట్టించుకోకుండా బన్నీ.. ఆర్య సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఆ సినిమా అతని కెరీర్ ను మార్చేసింది.

స్టైలిష్ లుక్ లో అతనిని చూసినవారు మంచి హీరో అవుతాడు అని జాతకం కూడా చెప్పారు. కరెక్ట్ గా 20 ఏళ్ల తరువాత అదే ఆర్య కుర్రాడు.. పుష్ప 2 తో పాన్ ఇండియాను ఏలడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మొదటి చిత్రం ఆర్య. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా బన్నీ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించింది. 2004, మే 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక ఈ సినిమా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్య గెట్ టుగెదర్ పార్టీని ఎరేంజ్ చేశారు. ఆర్య టీమ్ మొత్తం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఆర్య షూటింగ్ జ్ఞాపకాలతో పాటుఆ తరువాత తమ కెరీర్ ఎలా మారింది అన్నది కూడా వివరించారు. ఇక బన్నీ అయితే.. ఆర్య సినిమా 125 డేస్ ఆడుతుందని మొదటి రోజే అనుకున్నామని.. అందరూ 10 వీక్స్ మాత్రమే అనడంతో తనకు చాలా కోపం వచ్చిందని తెలిపాడు.

” మొదటి రోజు నేను థియేటర్ కు వెళ్లి అభిమానులతో కలిసి చూసాను. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అయితే బయటికి వచ్చాకా 10 వారాలు ఆడుతుంది అని చెప్పారు. అదేంటి.. 10 వారాలు మాత్రమేనా.. 125 డేస్ ఆడుతుందని మేము అనుకున్నాం.. కానీ, వీళ్లేంటి ఇలా అంటున్నారని నాకు కోపం వచ్చింది. ఇప్పటికీ నాకు బాగా అగుర్తుంది. మా నాన్న తో నేను చెప్పిన మాట నిజమయ్యింది.

Advertisement

డైనింగ్ టేబుల్ వద్ద నేను కూర్చొని ఉంటే.. నాన్న అల్లు అరవింద్ వచ్చి 10 వారాలు అంటే మాటలు కాదు. చాలా సినిమాలు అంతకంటే తక్కువే ఆడుతున్నాయి అనగానే.. అందరూ 10 వారాలు అంటారేంటి.. చూస్తూ ఉండండి ఈ సినిమాకు నేను కచ్చితంగా చిరంజీవి గారి చేతుల మీదుగా 125 డేస్ షీల్డ్ తీసుకుంటాను.. అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పాను. నేను కోపంలో చెప్పిన మాటలు నిజమయ్యాయి. చిరంజీవి గారి చేతుల మీదుగానే నేను షీల్డ్ తీసుకున్నాను” అని బన్నీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×