Big Stories

Motorola edge 50 fusion launch : 50 MP కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మోటో కొత్త ఫోన్.. మే 16న లాంచ్!

Motorola edge 50 fusion launch : Motorola గత నెలలో ప్రపంచ మార్కెట్‌లో Edge 50 Fusionను విడుదల చేసింది. ఏప్రిల్ 15న ఈ డివైజ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ ఫోన్ ఫారెస్ట్ బ్లూ హాట్ పింక్, మార్ష్‌మల్లో బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇప్పుడు కంపెనీ తన తాజా ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది.

- Advertisement -

కంపెనీ తన X ఖాతాలో ఈ సమాచారాన్ని అందించింది. ఫోన్ లాంచింగ్ తేదీని ప్రకటించింది. 50ఎంపీ అల్ట్రా పిక్సెల్ కెమెరాతో మోటరోలాకు చెందిన ఈ స్పెషల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు రాబోతోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Also Read : ఒప్పో రెనో నుంచి న్యూ 5G స్మార్ట్‌ఫోన్.. ఒక్క ఫోన్‌లో ఇన్ని కెమెరాలు ఏంట్రా బాబు!

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ను మే 16న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుంది. మోటరోలా తన అధికారిక X హ్యాండిల్‌లో అనేక టీజర్‌ల ద్వారా ఈ ఫోన్ లాంచ్ గురించి సమాచారాన్ని అందించింది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను సేల్‌కు తీసుకురానుంది.

మోటరోలా Edge 50 Fusionలో మీకు 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, IP68-రేటెడ్ బిల్డ్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇది కాకుండా Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్,  మార్ష్‌మల్లౌ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

మోటరోలా Edge 50 Fusion ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 12GB వరకు ఆన్‌బోర్డ్ RAMని కలిగి ఉంటుంది. Android 14-Hello UIలో పని చేస్తుంది. ఇది 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే‌తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఇది కాకుండా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

Also Read : ఇదే కదా కావాల్సింది.. రూ.17 వేల 5G ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్!

మోటరోలా Edge 50 Fusion ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఫోన్‌లో చూడొచ్చు. ఇందులో 50MP Sony LYTIA 700C ప్రైమరీ రియర్ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ మాక్రో షూటర్ ఉంటాయి. ఇది కాకుండా, ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News