BigTV English

Allu Arjun-Trivikram: అల్లు అర్జున్‌పై ఆశలు వదిలేసుకున్న త్రివిక్రమ్.. నెక్ట్స్ ఆ స్టార్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

Allu Arjun-Trivikram: అల్లు అర్జున్‌పై ఆశలు వదిలేసుకున్న త్రివిక్రమ్.. నెక్ట్స్ ఆ స్టార్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

Allu Arjun-Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతున్నారు. ఇక స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవల్ మూవీస్ చేసుకుంటూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న నేపథ్యంలో.. యంగ్ హీరోలు సైతం వాళ్లకు పోటీ ఇస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.


త్రివిక్రమ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. రచయితగా అతి తక్కువ కాలంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తనకంటూ ఓ బ్రాండ్ నేమ్‌ను సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న రచయితగా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించాడు. మాటలని తూటాలుగా చేసి పేల్చాలన్నా.. అదే మాటలతో కన్నీళ్లు కార్చాలన్నా త్రివిక్రమ్‌కే సాధ్యమైంది. పంచ్ డైలాగులు, ప్రాస డైలాగులు మాత్రమే కాదు.. జీవిత సత్యాలను ఆకట్టుకునేలా డైలాగుల రూపంలోకి మార్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఆయనకే సొంతం.

ఇక ఇలాంటి సందర్భాలలో ఆయన అందించిన కథలకు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్టార్ రైటర్‌గా కొన్నాళ్లపాటు వెలుగొందాడు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా మారి సినిమాలు చేస్తూ.. వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతున్నాడు. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పడల్లా ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఫస్ట్ త్రివిక్రమ్‌తో కలిసి మూవీ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ.. మధ్యలో తమిళ డైరక్టర్ అట్లీ ఎంట్రీ ఇవ్వడంతో.. ప్రాజెక్టు హోల్డ్‌లో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో మూవీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.


ఈ తరుణంలో త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్‌ను పక్కన పెట్టి.. ప్రభాస్‌తో సినిమా చేయాలనే ఆలోచనల్లో ఉన్నాడట. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడు మూడేళ్లపాటు అతని చేతినిండా సినిమాలు ఉన్నాయి. దీంతో త్రివిక్రమ్‌తో ప్రభాస్ మూవీ చేయడానికి టైమ్ పట్టే ఛాన్స్ ఉంది. కానీ ఆయన మాత్రం ప్రభాస్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాటడ. మరి త్రివిక్రమ్ ఎవరితో మూవీ తీయబోతున్నాడని అనౌన్స్ చేస్తే గానీ తెలీదు.. ఓ వైపు అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఈ ఇద్దరి స్టార్ హీరోలతో త్రివిక్రమ్ ఎవరితో తీస్తాడు..? ఎలాంటి మూవీ చేస్తాడు..? ఆ తర్వాత ఎలంటి సక్సెస్‌ను అందుకోబోతున్నారో వేచి చూడాల్సిందే..

Also Read: చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర అప్పు తీసుకున్న నాగబాబు.. ఎన్ని కోట్లో తెలుసా?

ఇక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరక్టర్లు అందురూ వరుస విజయాలతో ముందుకి దూసుకుపోతున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు. మరి తాను అనుకున్నట్టుగానే స్టార్ హీరోతో భారీ సినిమా తీసి సక్సెస్‌ను అందుకుంటే తప్పా.. మరోసారి ఆయనకు పూర్వ వైభవం రాదనే చెప్పాలి.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×