E-Paper
Advertisement

Amala Paul Wedding : రెండవ పెళ్లి చేసుకున్న సౌత్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్..

Amala Paul Wedding : రెండవ పెళ్లి చేసుకున్న సౌత్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్..
Advertisement

Amala Paul Wedding : హీరోయిన్ అమలా పాల్ ..ఈ అందాల భామ తన ప్రియుడిని రెండవ పెళ్లి చేసుకుంది. అమలా పాల్ కు ఇంతకుముందే పెళ్లి జరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకుంది అమలా పాల్. ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటైన ఈ జంట పెళ్లి అయిన కొన్ని రోజులకే మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఇక ఆ తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన అమలా పాల్ జగత్ దేశాయ్ కు దగ్గరయింది. గత కొద్దిరోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల తన ప్రేమ విషయంతో బాగా పాపులర్ అయింది.

ఆమె ప్రియుడు జగత్ ప్రపోజ్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈరోజు వీరిద్దరూ కొచ్చిలోని ఒక హోటల్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన లవ్ స్టోరీ ,ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . ఇక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఈ భామ.. ‘రెండు మనసులు ఒకటైన ఈవేళ.. జీవితాంతం ఈ చేతిని నేను వదలను’అంటూ పోస్ట్ కి క్యాప్షన్ కూడా జోడించింది.

Advertisement

మ్యారేజ్ కి వధూవరులు ఇద్దరు మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అమలాపాల్ లావెండర్ కలర్ హెవీ వర్క్ లెహంగా ధరించగా.. జగత్ ఆమెకు మ్యాచింగ్ గా లావెండర్ కలర్ షేర్వానీ ధరించాడు. ఎంతో క్యూట్ గా ఉన్న ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముచ్చటగా ఉన్న ఈ జంటను చూసి సెలబ్రిటీలే కాక అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రీసెంట్గా అమలాపాల్ తన పుట్టినరోజు సందర్భంగా జగత్ కు ప్రపోజల్ పంపింది.. దీంతో బర్త్డే పార్టీలో జగత్ మోకాలిపై కూర్చొని మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అందరి ముందు ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ వార్తకి ఎగ్జైట్ అయిన అమలా పాల్ నవ్వుతూనే అతనికి ఓకే చెప్పేసింది. దీంతో ఆమె చేతికి ఉంగరం తొడిగి జగత్ అక్కడే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ అమలాపాల్ వెనకడుగు వేస్తుందో అని ప్రపోజ్ చేసిన పది రోజులకే తమ లవ్ ను పెళ్లి పీటలు ఎక్కించాడు జగత్.

Advertisement

ఈ జంట రీసెంట్ గా ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ అంటూ బాత్ టవల్ కట్టుకొని దిగిన ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక వెడ్డింగ్ ఫొటోస్ అంటూ ఎటువంటి వింతలు చేస్తారో అని భావించిన వారు పద్ధతిగా ఉన్న వీళ్ళ పెళ్లి ఫోటోలు చూసి బాగా రిలాక్స్ అయ్యారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×