E-Paper
Advertisement

EAGLE Movie Teaser : తగ్గేదే లేదు.. సంక్రాంతి బరిలో మాస్ మహారాజ్ కన్ఫర్మ్..

EAGLE Movie Teaser : తగ్గేదే లేదు.. సంక్రాంతి బరిలో మాస్ మహారాజ్ కన్ఫర్మ్..
Advertisement

EAGLE Movie Teaser : మాస్ మహారాజు రవితేజ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఈగల్.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ,మోషన్ టీజర్ అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ బృందం మరొక క్రేజీ అప్డేట్ తీసుకు వచ్చింది.

ఈగల్ మూవీ టీజర్ విడుదల డేట్ తో పాటు టైం ని కూడా మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. రవితేజ ఈగల్ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఏ మూవీకి సంబంధించిన టీజర్ ను నవంబర్ 6 న ఉదయం 10 గంటల 44 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఓ రేంజ్ లో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

Advertisement

అయితే మెయిన్ గా రవితేజ కళ్ళు హైలైట్ అయ్యే విధంగా విడుదల చేసిన ఈ పోస్టర్ చాలా వెరైటీగా ఉంది. ఈరోజు విడుదలైన ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక మాస్ మహారాజ్ అభిమానులు దీన్ని ఫుల్ గా షేర్ చేసి మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉందో అర్థమవుతుంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

రవితేజ ఈ మూవీలో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలిసిందే.మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగడానికి రెడీగా ఉంది అని అందరూ భావించారు. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి.. థియేటర్ల విషయంలో కూడా బాగా ఇబ్బంది ఎదురవుతుంది.. అని భావించిన చిత్ర బృందం సినిమా విడుదలను వాయిదా వేసినట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ గాసిప్ పై ఈగల్ మూవీ మేకర్స్ స్పందించారు.

Advertisement

ఈగల్ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే సంవత్సరం జనవరి 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎన్ని సినిమాలు ఉన్నా విడుదల తేదీని మాత్రం మార్చేది లేదని తేల్చి చెప్పారు. తమ స్టోరీ పై,సినిమా పై పెద్ద ఎత్తున నమ్మకం ఉన్నట్లు వాళ్ళ మాటలను పట్టే తెలుస్తోంది. దసరాకి వచ్చిన టైగర్ నాగేశ్వరరావు విషయంలో రవితేజ కాస్త వీక్ అయ్యాడు మరి ఏ మూవీ తో అన్నా హిట్టు కొడతాడో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×