BigTV English
Advertisement

Amalapaul: ఆ స్టార్ హీరోయిన్ వల్లే భర్తకు విడాకులు.. ఇదే ఊహించని ట్విస్ట్ అంటే..!

Amalapaul: ఆ స్టార్ హీరోయిన్ వల్లే భర్తకు విడాకులు.. ఇదే ఊహించని ట్విస్ట్ అంటే..!

Amala Paul.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ (Amala Paul) మొదటి సినిమాతోనే తన అందచందాలతో, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో అడపాదడపా నటించి, అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది. అక్కడే కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ (Director Vijay)ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.


సమంతను టార్గెట్ చేస్తున్న ఆకతాయిలు..

ఇదంతా ఇలా ఉండగా.. అమలాపాల్ మొదటి భర్త విజయ్ నుండి విడిపోవడానికి కారణం స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అసలు విషయంలోకెళితే.. ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వివాహం జరిగిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోయింది. ఇక సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పేరును చాలా విషయాలలో కొంతమంది ట్రోలర్స్ ఉపయోగించారు కూడా.. ముఖ్యంగా శ్రీజ (Sreeja), నిహారిక (Niharika ) విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె అంటూ కూడా విమర్శలు గుప్పించారు. నిజానికి వీరి విడాకుల వెనుక సమంత హస్తం లేకపోయినా.. ఆమెను చూసి వీరు ఇన్స్పైర్ అయ్యి ,తమ భర్తలకు విడాకులు ఇచ్చారు అంటూ కొత్త రూమర్లు క్రియేట్ చేశారు.దీనికి తోడు ఇప్పుడు అమలాపాల్ విషయంలో కూడా సమంత పేరును బయటకు తీసుకొస్తూ ఉండడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సమంత తప్పుకున్న మూవీలో అమలాపాల్..

అసలు విషయంలోకి వెళితే.. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకునే సమయంలో.. ఇంటిమేట్ సన్నివేశాలు చేయకుండా, కేవలం సాంప్రదాయంగా ఉండే పాత్రలు మాత్రమే చేస్తానని తన భర్తకు మాట ఇచ్చిందట. కానీ తన భర్తకు ఇచ్చిన మాటను తప్పి సమంతా తప్పుకున్న ఒక సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమలాపాల్. ధనుష్ హీరోగా నటించిన వడా చెన్నై సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంది. అయితే ఈ సినిమాలో మొదట సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు చిత్ర బృందం.అయితే ఈ సినిమా కథను మొదట సమంతా కు చెప్పగా.. తనకంటే హీరోయిన్ అమలాపాల్ కే కథ సెట్ అవుతుందని డైరెక్టర్ కి చెప్పడంతో వెంటనే ఆయన అమలాపాల్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అమలాపాల్ కూడా రిజెక్ట్ చేయడానికి కారణాలు లేకపోవడం వల్లే ఒప్పుకున్నట్లు సమాచారం.

సమంత వల్లే మొదటి భర్తకు విడాకులు..

అయితే ఈ సినిమాలో నటిస్తానని చెప్పినప్పుడు ఈమె భర్త ఒప్పుకోలేదట. అయినా సరే అతని మాట వినకుండా ఈ సినిమాలో నటించింది అమలాపాల్. దీంతో మాట వినలేదని హర్ట్ అయిన విజయ్ అప్పటినుంచి ఈమె తో తరచూ గొడవపడే వారట. ఇక అలా గొడవలు కాస్త పెద్దవై చివరికి విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి.. అదే సమయంలో సమంత గనుక నాడు అమలపాల్ పేరును సజెస్ట్ చేసి ఉండకపోయి ఉండి ఉంటే, నేడు ఆమె తన మొదటి భర్తతోనే సంతోషంగా కాపురం చేసుకునేది అని కొంతమంది కామెంట్లు చేయగా.. మరికొంతమంది అలాంటి భర్తతో ఉండడం కంటే స్వేచ్ఛగా విడాకులు తీసుకొని జీవించడం మేలు అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేసినట్లు సమాచారం..

అసలు అమలాపాల్ – విజయ్ విడాకులకు కారణం ఎవరు..?

అయితే వీరిద్దరి విడాకులకు కారణం మరో విషయం అంటూ ఇంకో వార్త తెరపైకి వచ్చింది.అమలాపాల్ విజయ్ తో పెళ్లి జరగక ముందే ధనుష్ (Dhanush )తో రఘువరన్ బీటెక్ సినిమా చేసిన విషయం తెలిసిందే.ఈ సమయంలో వీరిద్దరూ ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. కానీ వాటిలో నిజం లేకపోయింది. దీనికి తోడు విజయ్ వద్దన్నా వినకుండా ధనుష్ వడా చెన్నై సినిమాలో మళ్లీ నటించడానికి సిద్ధమైంది అమలాపాల్. ఈ సమయంలో రూమర్లు జోరుగా వినిపించడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన విజయ్ ఆమెతో తరచూ గొడవపడే వారట. దీంతో అమలాపాల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది. అయినా సరే రూమర్స్ ఆగకపోవడంతో ఎట్టకేలకు ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరి ఇద్దరు విడిపోయినట్లు సమాచారం.. అయితే ఈ రెండు వార్తలలో నిజం ఏది ఉందో తెలియదు కానీ సమంత పేరును లాగుతూ వీరిద్దరి విడాకుల కారణం ఆమె అంటూ వార్తలు క్రియేట్ చేయడంతో సమంత అభిమానులు పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సమంతను మధ్యలోకి లాగడంతో ఆమె అభిమానులు పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×