Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘బద్రి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ప్రముఖ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel). బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా వైవాహిక బంధానికి మాత్రం ఈమె నోచుకోలేదు. అయితే పెళ్లి చేసుకుంటుంది అని అనుకునే లోపే సడన్గా తల్లి కాబోతోంది అంటూ వార్తలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి పెళ్లి కాకుండానే తల్లి అవడం ఏంటి అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..
తెలుగు, హిందీ భాషలలో వరుసగా నటిస్తూ తన అందంతో ఒక ఊపు ఊపిన అమీషా పటేల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈమె అక్కడ నుంచి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్ లో బికినీ ధరించి, మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోలను కాస్త క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అమీషాకి బేబీ బంప్ ఉన్నట్లుగా పొట్ట భాగం కాస్త ఉబ్బి కనిపించడంతో నెట్టింట చర్చ మొదలైంది. 49 సంవత్సరాల వయసులో పెళ్లికాకుండా తల్లి ఎలా అయ్యారు? అసలు దీనికి కారణం ఎవరు? అంటూ కూడా చాలా దారుణంగా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ కామెంట్లపై అమీషా పటేల్ స్పందించలేదు. కానీ ఈ విషయాలు మాత్రం చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయంలోకి ఇలియానాను లాగుతున్న నెటిజన్స్..
ఇకపోతే ఈ విషయంలోకి ప్రముఖ హీరోయిన్ ఇలియానాను కూడా లాగుతున్నారు నెటిజన్స్. ఎందుకంటే గతంలో ఇలియానా కూడా పెళ్లి కాకుండానే తల్లి అయింది. ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తను అందరికీ పరిచయం చేసింది. గర్భవతి అయిన తర్వాత తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చూపించకుండా కాస్త దాగుడుమూతలు ఆడడంతో ఈమెపై చాలామంది చాలా రకాలుగా విమర్శలు గుప్పించారు. దారుణంగా ట్రోల్స్ చేశారు. కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లాడికి తండ్రి ఎవరో అందరికీ చూపించింది ఇలియానా. ఇక ఇప్పుడు ఆమె బాటలో అమీషా పటేల్ కూడా నడుస్తోందా.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే ఆ బిడ్డకు తండ్రి ఎవరో చూపిస్తుందా.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై అమీషా పటేల్ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. మొత్తానికైతే అమీషా పటేల్ షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అమీషా పటేల్ కెరియర్..
అమీషా పటేల్ 1975 జూన్ 9న ముంబై, మహారాష్ట్రలో జన్మించింది. మోడల్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. 2000 సంవత్సరంలో ‘ కహో నా ప్యార్ హై’ అనే సినిమా ద్వారా హిందీ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత తెలుగులో బద్రి, నాని సినిమాల ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 2005లో ‘నరసింహుడు’ సినిమాలో నటించిన ఈమె తర్వాత మళ్ళీ తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
Also Read:Rashmika – Vijay Deverakonda: మళ్లీ దొరికిపోయిన రష్మిక – విజయ్.. ఈ సారైనా ఓపెన్ అవ్వండబ్బా..!