Rashmi Gautam:జబర్దస్త్ (Jabardast) యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తన వాక్చాతుర్యంతో అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది. అయితే ఈమె తాజాగా హాస్పిటల్ లో కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కొన్ని నెలలుగా తన ఆరోగ్యం బాగోలేదని, ఎక్కడో తేడా కొడుతుందని అనుమానం కూడా వచ్చిందని, అందుకే త్వరగా తన కమిట్మెంట్లను పూర్తి చేసుకున్నానని చెప్పింది. ముఖ్యంగా విపరీతమైన రక్తస్రావం, ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి. చివరికి హిమోగ్లోబిన్ స్థాయి కూడా 9 కి పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే హాస్పిటల్ లో చేరాను. అంటూ హాస్పిటల్లో హాస్పిటల్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది.
అధిక రక్తస్రావం.. భరించలేకపోయా – రష్మీ
ఇక ఫోటోల కింద అసలు విషయం చెప్పుకొచ్చింది రష్మీ గౌతం.. “ఈ ఐదు రోజులు నాకు తోడుగా ఉన్న కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీం కి ధన్యవాదాలు. సడన్గా నా హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. జనవరి నుంచి కంటిన్యూగా రక్త స్రావం అవుతూనే ఉంది. అటు భుజాలు కూడా చాలా నొప్పి పుట్టించేవి. ఆ బాధను భరించలేకపోయాను. ఇక ఈ సమస్య గురించి ఏ డాక్టర్ను కలవాలో కూడా అర్థం కాలేదు. ఎలాగోలా మార్చి 29 వరకు నేను కమిట్ అయిన ప్రాజెక్టులను మేనేజ్ చేస్తూ కష్టంగానే పూర్తి చేశాను. ఇక ఏప్రిల్ 18వ తేదీన ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు క్షేమంగా ఉన్నాను. కానీ నాకు వచ్చిన ఈ సమస్య ఏంటి అన్నది మాత్రం అటు వైద్యులు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే రెస్ట్ మోడ్ లో ఉండాలని వైద్యులు చెప్పారు అంతా సెట్ అయ్యాక మళ్ళీ గట్టిగా కంబ్యాక్ ఇస్తాను” అంటూ రష్మీ గౌతం చెప్పుకొచ్చింది. మొత్తానికైతే మరో మూడు వారాలు రెస్ట్ లో ఉంటానని చెప్పిన ఈమె అసలు ఏమైంది అనే విషయాన్ని చెప్పలేదు దీంతో అభిమానులు ఏం జరిగింది.. అంటూ కంగారుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రష్మీ గౌతమ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్మీ గౌతమ్ కెరియర్..
రష్మీ గౌతమ్ కెరియర్ విషయానికి వస్తే.. అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. మొదట తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో ఈమె హీరోయిన్గా నటించాల్సి ఉంది. దాదాపు 90% ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత సినిమా నుంచి తప్పించారు
. ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించింది. కానీ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటుంది. ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Also Read:Rashmika – Vijay Deverakonda: మళ్లీ దొరికిపోయిన రష్మిక – విజయ్.. ఈ సారైనా ఓపెన్ అవ్వండబ్బా..!