E-Paper
Advertisement

Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో ప్రమాదం.. అమితాబ్‌కు గాయం

Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో ప్రమాదం.. అమితాబ్‌కు గాయం
Advertisement

Amitabh Bachchan: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూమీ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరగుతోంది.

ఇదిలా ఉండగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ బచ్చన్‌కు గాయాలయ్యాయి. అతని పక్కటెముకలకు దెబ్బతగిలింది. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని అబితాబ్ తన బ్లాగ్ వేదికగా తెలియజేశారు.

Advertisement

‘‘హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్ జరగుతుండగా నా పక్కటెముకలకు దెబ్బ తగిలింది. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. వైద్యులు కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అందువల్ల షూటింగ్ వాయిదా వేసుకొని ముంబై వచ్చేశాను. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను’’ అని అబితాబ్ బచ్చన్ తెలిపారు.

ఇక మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ 12 జనవరి 2024న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×