BigTV English
Advertisement

Viveka Murder Case : వివేకా హత్యకేసులో మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణ రెడీ: అవినాష్ రెడ్డి

Viveka Murder Case : వివేకా హత్యకేసులో మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణ రెడీ: అవినాష్ రెడ్డి

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. వివేకా హత్య కేసులో కీలకపాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు ప్రశ్నించారు.


మార్చి 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ శనివారం నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అయితే మార్చి 6న విచారణకు రాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోతున్నానని లేఖ రాశారు. దీంతో ఆదివారం రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి మరోసారి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

జవవరి 28, ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన అధికారులు మరోసారి ఎంపీని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ కూడా సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. ఆయన కూడా విచారణ హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.


విచారణకు రెడీ..
వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, గృహ సారథులు, వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. తన తండ్రి భాస్కర్‌రెడ్డి ఈ నెల 12న కడపలో విచారణకు హాజరవుతారని చెప్పారు. తండ్రీకొడుకుల విచారణ తర్వాత సీబీఐ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×