E-Paper
Advertisement

Ram Pothineni: సంతోషం అన్నా.. ఇప్పటికైనా ప్రమోషన్స్ మొదలెట్టావ్

Ram Pothineni: సంతోషం అన్నా.. ఇప్పటికైనా ప్రమోషన్స్ మొదలెట్టావ్
Advertisement

Ram Pothineni: ప్రస్తుతం సినిమా తీయడం ముఖ్యం కాదు. ఆ సినిమాను ప్రజల మధ్యకు తీసుకెళ్లడం ముఖ్యం. కొన్నిసార్లు అందులో విఫలమయ్యే ఎన్నో సినిమాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా కంటే ప్రమోషన్స్ కే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అలాంటిది.. ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ఏ రేంజ్ లో ప్రమోషన్స్ ఉండాలి. కానీ, డబుల్ ఇస్మార్ట్ మాత్రం చడీచప్పుడు లేకుండా చప్పగా ప్రమోషన్స్ చేస్తుంది.

రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి- ఛార్మీ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇంకో పది రోజుల్లో సినిమా పెట్టుకొని డబుల్ ఇస్మార్ట్ బృందం ఇంకా ప్రమోషన్స్ మొదలుపెట్టడం లేదు అనేది ఫ్యాన్స్ ఆవేదన. పోనీ, ఆ రోజు వేరే ఏ సినిమా లేకపోతే.. గుడ్డిలో మెల్ల అన్నట్లు రామ్ సినిమాకు వెళ్ళిపోయేవారు.

Advertisement

అయితే అదే రోజు రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. హరీష్ శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్ జూలై నుంచే చేయడం మొదలుపెట్టాడు. వరుస ఇంటర్వ్యూలు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఫ్రెండ్ షిప్ డే ఈవెంట్.. మెట్రోలో రవితేజ ఆడియో.. ఇలా డిఫరెంట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీంతో అందరూ మిస్టర్ బచ్చన్ వైపు మొగ్గు చూపుతారు అని చెప్పడంలో ఆశ్చర్యంలేదు.

ఇకపోతే రామ్ మాత్రం ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి.. ఇక నేటి నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టాడు. తాజాగా రామ్, కావ్య థాపర్, గెటప్ శ్రీను స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. రేపు ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ కానుంది. దీంతో రామ్ ఫ్యాన్స్.. సంతోషం అన్నా.. ఇప్పటికైనా ప్రమోషన్స్ మొదలెట్టావ్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆగస్టు 15 న రవితేజ వర్సెస్ రామ్.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×