35 Chinna Katha Kadu: నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది నివేథా థామస్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నివేథా థామస్.. ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గత కొంతకాలంగా ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చివరగా నివేథా.. శాకినీ డాకిని చిత్రంలో కనిపించింది. కొన్ని అనారోగ్య కారణాల వలన ఆమె బరువు పెరిగినట్లు తెలుస్తోంది. దాని వలనే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని టాక్.
ఇక ఇవన్నీ పక్కనపెడితే.. చాలా గ్యాప్ తరువాత నివేథా నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. నందకిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అరుణ్ దేవ్, అనన్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొట్ట మొదటిసారి నివేథా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది.
ఇక ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే రోజున రెండు పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానున్న నేపథ్యంలో వాటితో పోటీ ఎందుకు అని.. 35 చిన్న కథ కాదు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ డేట్ కాకుండా సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రేక్షకులకు తెలియజేయనున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే 35 చిన్న కథ కాదు కొత్త రిలీజ్ డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే.